విజయవాడలోని ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఓ యువకుడు గల్లంతు అయ్యారు.బ్యారేజ్ రైలింగ్ పై ఫొటోలు దిగుతుండగా ప్రమాదవశాత్తు కృష్ణా నదిలో పడినట్లు స్థానికులు చెబుతున్నారు.
కాగా గల్లంతైన యువకుడు దుర్గాప్రసాద్ గా గుర్తించారు.సమాచారం అందుకున్న ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది గల్లంతు అయిన యువకుని కోసం గాలిస్తున్నారు.