హైదరాబాద్ కేపీహెచ్బీలోని మైత్రి చిల్డ్రన్ హోమ్ నిర్వాహకులపై కేసు నమోదు అయింది.మేడ్చల్ డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ అధికారి ఫిర్యాదు చేశారు.
చిల్డ్రన్ హోమ్ లోని చిన్నారులతో బాత్రూం క్లీనింగ్, కూరగాయాలు తరగడం వంటి పనులు చేయిస్తున్నట్లు గుర్తించారు.అంతేకాకుండా నిర్వాహకులు బీఎల్ నరసింహరావు, అతని కొడుకు బి.ప్రణీత్ కుమార్ లు కాళ్లకు కూడా మసాజ్ చేయించుకున్నారని సమాచారం.పనులు చేయకపోతే పిల్లలను బెల్ట్ తో కొడుతున్నట్లు గుర్తించారు.
ఈ నేపథ్యంలో తండ్రీ కొడుకులపై జువైనల్ జస్టిస్ యాక్ట్ ప్రకారం కేసు నమోదైంది.అనంతరం చైల్డ్ వేల్ఫేర్ కమిటీ ఆదేశాలతో చిన్నారులను మరో హోంకు తరలించారు.