కేసీఆర్ ఇచ్చిన హామీలు – అమలు తీరుపై బీజేపీ పోస్టర్ విడుదల చేసింది.కేసీఆర్ హామీలను అమలు చేయకపోవడాన్ని పోస్టర్లలో ఎండగట్టారు.
ఈ సందర్భంగా బీజేపీ చీఫ్ బండి సంజయ్ మాట్లాడుతూ ప్రజలను మోసం చేసేందుకు కేసీఆర్ సిద్ధమయ్యారని విమర్శించారు.మునుగోడులో మందు.
డబ్బుతో గెలవాలని చూస్తున్నారని మండిపడ్డారు.తెలంగాణ ప్రజల భవిష్యత్ మునుగోడు ఫలితంపై ఆధారపడి ఉందని వ్యాఖ్యనించారు.
కేసీఆర్ అబద్ధాలపై బీజేపీ శ్రేణులు విస్తృతంగా ప్రచారం చేయాలని స్పష్టం చేశారు.