టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా నటించిన చిత్రం పుష్ప.ఈ సినిమా గత ఏడాది విడుదలైన విషయం అందరికి తెలిసిందే.
ఈ సినిమా విడుదల అయ్యి దాదాపు రెండు నెలలు పూర్తి అయినా కూడా ఈ సినిమాకి ఇంకా తగ్గడం లేదు.ఎక్కడ చూసినా కూడా ఈ సినిమా పాటలు డైలాగులు మారుమోగి పోతున్నాయి.
చిన్నా పెద్దా అని తేడా లేకుండా ప్రతి ఒక్కరు ఈ సినిమాలోని పాటలకు స్టెప్పులను వేస్తూ అందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.
ఇక ఈ మధ్య కాలంలో పుష్ప సినిమాలోని డైలాగ్ మరింత పాపులర్ అయ్యాయి.
ఈ సినిమాలోని పాటల లోని స్టెప్పులను సామాన్యులే కాకుండా, పెద్ద పెద్ద సెలబ్రిటీలు, అలాగే క్రికెటర్లు కూడా డాన్సులు వేస్తూ అందుకు సంబంధించిన ఫొటోలు వీడియోలను సోషల్ మీడియాలో చేస్తున్నారు.మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఈ సినిమాలో శ్రీవల్లి పాట బాగా ఫేమస్ అయ్యింది.
అంతేకాకుండా పుష్ప సినిమాలోని శ్రీవల్లి సాంగ్ ట్యూన్ ని తీసుకుని ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచార గీతాన్ని విడుదల చేశారు.అదే విధంగా దక్షిణ మధ్య రైల్వే కూడా ఈ సినిమా లోని పాటలు వాడటం విశేషం.
అంతేకాకుండా హైదరాబాద్ పోలీసులు రోడ్డు భద్రత నియమాలు పై అవగాహన కల్పించడానికి పుష్పా సినిమాలోని డైలాగులను ఉపయోగించుకున్నారు.ఈ నేపథ్యంలోనే తాజాగా ఒక చిన్నోడు పుష్ప సినిమాలో డైలాగ్స్ తో ఇంస్టా రీల్స్ చేస్తూ అదరగొడుతున్నాడు.
ప్రస్తుతం ఆ బుడ్డోడికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఆ చిన్నారి చేసిన వీడియోలకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
అందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.