ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో పవన్ కళ్యాణ్ వాహనం ‘వారాహి’ కాక లేపుతుంది, వైసీపీ నేతలు వారాహిపై తీవ్ర స్థాయిలో విరుచుపడుతున్నారు.చంద్రబాబు తగ్గట్టుగా ఆ వాహనంపై ‘నారా’హి అని పేరు మార్చుకోవాలని వైఎస్‌ఆర్‌సిపి మంత్రులు పవన్ కళ్యాణ్‌కు సలహా ఇస్తున్నారు.
ఆ ఆరోపణలకు తగ్గట్టుగానే ఆశ్చర్యకరంగా ఈ వాహనం కొత్త రిజిస్ట్రేషన్ నంబర్‌కు మరొక అరిష్ట లింక్ ఉంది.వాహనం నెంబర్ 8384ను మొత్తం కలిపితే 23 వస్తుంది.
అంటే అది 2019లో టీడీపీ గెలిచిన సీట్ల సంఖ్య.అలాగే తాను సీఎంగా ఉన్నప్పుడు వైఎస్సార్‌సీపీ నుంచి 23 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారని, ఆ తర్వాత 2019 ఎన్నికల్లో కేవలం 23 సీట్లు మాత్రమే గెలుపొందారని, మే 23న ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయని గుర్తుంచుకోవాలన్నారు.
కాబట్టి అన్ని విధాలుగా, 23కి CBNతో లింక్ ఉందంటూ విమర్శించారు.ఈ విఫయాన్ని డీకోడ్ చేస్తూ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ పవన్ పై విరుచుకుపడ్డారు.ఏపీలో రిజిస్టరైన వాహనం ఆర్టీఏ నిబంధనలు పాటించాల్సిందేనని, దానికి భయపడి తెలంగాణ రాష్ట్రంలో చేయించుకున్నానని, ఏపీలో కాకుండా ఆ రాష్ట్ర వాసి అక్కడ కాబట్టి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు.” పవన్ వ్యంగ్యంగా విమర్శిస్తూ – ” వాహనం సంఖ్య 8384, ఇది మొత్తం కలిపితే 23, ఇది చంద్రబాబుకు ఇష్టమైన సంఖ్య.

దీని అర్థం వాహనం ద్వారా జనాల్లోకి వెళ్ళి చంద్రబాబుకు మేలు చేయడమే పవన్ ఉద్దేశమన్నారు”.ఏది ఏమైనప్పటకీ పవన్ యాత్ర ప్రభావం తమ పార్టీపై పడకుడదని వైసీపీ గట్టిగానే ప్రయత్నిస్తుంది.దీంతో వరుసగా వైసీపీ నాయకులు పవన్‌పై దండయాత్ర మెుదలుపెట్టారు.అయితే ఈ యాత్రపై స్పందించిన జనసేన పవన్ యాత్రకు వైసీపీ ఆడ్డంకులు స్పష్టిస్తుంటున్నారు. ఏపీలోని ఆర్టీఏ(రోడ్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ) టూర్‌లో కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రస్తావిస్తూ వారాహికి ఇబ్బందిని సృష్టిస్తుందని విమర్శిస్తున్నారు.