కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారని వస్తున్న వార్తలను ఆ పార్టీ నాయకురాలు కొండా సురేఖ ఖండించారు.తాను పార్టీకి రాజీనామా చేస్తున్నానన్న వార్తలు అబద్ధమని చెప్పారు.
పార్టీ మారే ఆలోచన లేదని, ఆ అవసరం కూడా లేదని పేర్కొన్నారు.పార్టీ ఇచ్చిన ఎగ్జిక్యూటివ్ కమిటీ పోస్టుకు రాజీనామా చేసినట్లు తెలిపారు.
పార్టీలో సీనియర్ నేతగా గౌరవం తగ్గించినట్లుగా ఉందని ఆమె వ్యాఖ్యనించారు.పదవులు ముఖ్యం కాదన్న కొండా సురేఖ గతంలో మంత్రి పదవికి రాజీనామా చేసిన విషయాన్ని గుర్తు చేశారు.
అనంతరం ఈ అంశాన్ని ఇష్యూ చేయొద్దని కొండా సురేఖ స్పష్టం చేశారు.ఇదే విషయాన్ని పీసీసీ దృష్టికి తీసుకెళ్లినట్లు, ఆయన అధిష్టానానికి వివరిస్తానన్నారని వెల్లడించారు.