హీరోయిన్స్ కు పెళ్లి వయసు వస్తే చాలు పెళ్లెప్పుడు అంటూ.పెళ్లయితే పిల్లలు ఎప్పుడు అంటూ జనాలు తెగ ప్రశ్నలతో వారిని బాగా ఇబ్బంది పెడుతూ ఉంటారు.
అయినా కూడా హీరోయిన్స్ వీటి గురించి స్పందించకుండా తమ లైఫ్ ఏంటో తాము చూసుకుంటూ ఉంటారు.కానీ వారికి వయసు దాటి పోతుంటే మాత్రం ఇటువంటి ప్రశ్నలు మరింత ఎక్కువగా ఎదురవుతూ ఉంటాయి.
వయసు అయిపోతుంది ఇంకెప్పుడు పెళ్లి చేసుకుంటారు అంటూ నేరుగా వచ్చి అడిగినా కూడా హీరోయిన్స్ వాటిని లైట్ తీసుకుంటూ.అయితే తాజాగా ఇటువంటిదే మరో హీరోయిన్ కి ఎదురయింది.
ఇంతకు ఆమె ఎవరో కాదు నభా నటేష్.
టాలీవుడ్ ఇండస్ట్రీ కి చెందిన గ్లామర్ బ్యూటీ నభా నటేష్.
ఈమె తెలుగు ప్రేక్షకులకు పరిచయమే.తన అందంతో ఎంతోమంది మనసులను దోచుకున్న ఈ ముద్దుగుమ్మ నటనతో కూడా మంచి గుర్తింపును దక్కించుకుంది.
మోడల్ రంగంలో మంచి పేరు సంపాదించుకొని తరువాత సినీ పరిశ్రమకు పరిచయం అయ్యింది.తొలిసారిగా 2015 లో కన్నడం లో వజ్రకాయ సినిమాతో సినీ పరిశ్రమకు పరిచయమైంది.
ఇక 2018లో నన్ను దోచుకుందువటే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయింది.ఈ సినిమా తనకు అంతగా సక్సెస్ ఇవ్వకపోగా.
ఆ తర్వాత నటించిన ఇస్మార్ట్ శంకర్ సినిమాలో మాత్రం తన పాత్రతో అందరిని ఆకట్టుకుంది.
ఈ సినిమాతో మరింత క్రేజ్ సంపాదించుకుంది.గతంలో సోలో బ్రతుకే సో బెటర్ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే.కానీ ఈ సినిమా అంతగా సక్సెస్ కాలేకపోయింది.
ఇక ఇప్పుడు అంతగా అవకాశాలు అందుకోకా సినీ ఇండస్ట్రీకి కాస్త దూరంగా ఉన్నా కూడా సోషల్ మీడియాతో మాత్రం తన అభిమానులకు టచ్ లో ఉంటుంది.తన సోషల్ మీడియా ఖాతాలో తనకు సంబంధించిన ఫోటో లను షేర్ చేస్తూ కుర్రాళ్ళ మనసులను దోచుకుంటుంది.
సాంప్రదాయ దుస్తులతో, మోడ్రన్ దుస్తులతో దర్శనమిస్తూ అందరినీ ఆకట్టుకుంటుంది.అంతేకాకుండా సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరితో సన్నిహితంగా ఉంటూ.కామెంట్ చేసే ప్రతి ఒక్కరికి సమాధానం ఇస్తుంది.
ఖాళీ సమయం దొరికినప్పుడల్లా తన ఫాలోవర్స్ తో తెగ ముచ్చట్లు పెడుతూ ఉంటుంది.వాళ్లు అడిగిన ప్రశ్నలకు ఓపికగా సమాధానం ఇస్తుంది.ఇక సినిమాలలో అవకాశాలు అందుకోవడం కోసం ఈ అమ్మడు బాగా ప్రయత్నిస్తుంది.
హాట్ హాట్ లుక్ లతో పొట్టి పొట్టి బట్టలతో ఫోటో షూట్ చేయించుకుని అందరి దృష్టిలో పడుతుంది.కానీ ఈ అమ్మడు అంతగా అవకాశాలు అందుకోలేకపోతుంది.ఇదంతా పక్కన పెడితే తాజాగా తన ఇన్ స్టాలో ఒక ఫోటో షేర్ చేసుకుంది.అయితే అందులో తను కాస్త గ్లామర్ షో చేసినప్పటికీ తన ఫేసులో ముదురుతనం కనిపించింది.
దీంతో తన ఫేస్ ని అలా చూసిన నెటిజన్స్ ఫేస్ ముదిరిపోయింది అంటూ.ఇంకెప్పుడు పెళ్లి చేసుకుంటావు అంటూ కామెంట్స్ పెడుతున్నారు.