రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లో క్షుద్రపూజలు కలకలం సృష్టించాయి.స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గుర్తు తెలియని దుండగులు క్షుద్రపూజలు చేసినట్లు స్థానికులు గుర్తించారు.
ఈ క్రమంలో సైన్స్ ల్యాబ్, స్టోర్ రూమ్ ముందు బొమ్మలు, పసుపు, కుంకుమలతో పాటు నిమ్మకాయలను గుర్తించారు.స్కూల్ లో బొమ్మలు, పసుపు, కుంకుమను చూసి విద్యార్థులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
దీంతో అప్రమత్తమైన స్కూల్ యాజమాన్యం క్షుద్రపూజల సామాగ్రిని బయటపడేశారు.