వచ్చే ఎన్నికల్లో టిడిపి, జనసేన( TDP, Jana Sena ) కలిసి ముందుకు వెళుతున్న నేపథ్యంలో, ఇప్పటికే సీట్ల సర్దుబాటు వ్యవహారాన్ని దాదాపుగా ముగించాయి.పొత్తులో భాగంగా జనసేనకు టిడిపి 24 సీట్లను కేటాయించింది.
మిగతా నియోజకవర్గాల్లో టిడిపి అభ్యర్థులే పోటీ చేయనున్నారు.రెండు పార్టీలు పరస్పరం సహకరించుకుని ఓట్ల బదిలీ సజావుగా సాగే విధంగా, రెండు పార్టీల నేతల మధ్య సమన్వయం ఉండేలా ప్లాన్ చేశారు.
ఈరోజు తాడేపల్లిగూడెంలో రెండు పార్టీలు కలిపి భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశాయి.

ఇదిలా ఉంటే జనసేన పార్టీ ఎన్నికల గుర్తు గాదు గ్లాసు విషయంలో ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయం తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు టెన్షన్ కలిగిస్తుంది.ఈ ఎన్నికల్లో జనసేన అభ్యర్థులకు గాజు గ్లాస్ గుర్తు కేటాయించాలని ఈసీ ఆదేశాలు ఇచ్చింది.దీంతో పాటు జనసేన పోటీ చేయని నియోజకవర్గాల్లో అదే గాజు గ్లాస్ గుర్తును ఫ్రీ సింబల్ జాబితాలో పెట్టచ్చని నిర్ణయం తీసుకుంది.
దీంతో 24 అసెంబ్లీ , మూడు పార్లమెంటు నియోజకవర్గల్లో జనసేన అభ్యర్థులు గాజు గ్లాస్ గుర్తు పైనే పోటీ చేయనున్నారు.

కానీ మిగిలిన 151 అసెంబ్లీ 22 ఎంపీ స్థానాల్లో గాజు గ్లాసు గుర్తుపై స్వతంత్ర అభ్యర్థులు పోటీ చేస్తే.టిడిపి( TDP )కి జరిగే నష్టం తీవ్రంగానే ఉంటుంది.టిడిపి జనసేన పొత్తులో భాగంగా టిడిపికి పడాల్సిన జనసేన ఓట్లు భారీగా స్వతంత్రులకు పడే అవకాశం ఉంటుంది.
టిడిపి, జనసేన ఓట్లను టిడిపికి వేయకుండా స్వతంత్ర అభ్యర్థులను వైసిపి రంగంలోకి దించితే జరిగే నష్టం తీవ్రంగానే ఉంటుంది.ఈ విషయమై జనసేన కంటే తెలుగుదేశం ఎక్కువ ఆందోళన పడుతోంది.
ఇప్పటి వరకు టిడిపి, జనసేన పొత్తు బాగా కలిసి వస్తుందని , కచ్చితంగా అధికారంలోకి వస్తామనే ధీమాతో టీడీపీ ఉంటూ వచ్చింది.కానీ జనసేన పోటీ చేయని నియోజకవర్గల్లో గాజు గ్లాస్ గుర్తు ఫ్రీ సింబల్ కావడంతో, ఖచ్చితంగా ఆ గుర్తే తమ కొంప ముంచుతుంది అనే భయం టీడీపీలో మొదలయ్యింది.