కాంగ్రెస్ ఆ సాహసం చేస్తుందా ?

తెలంగాణలో కాంగ్రెస్( Telangana Congress ) అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే.హస్తం పార్టీని అధికారంలోకి తీసుకురావడంతో ఆ పార్టీ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ముఖ్య పాత్ర పోషించారు.

 Will The Congress Party Do That, Telangana Congress ,tpcc, Bcs, Cm Revanth Redd-TeluguStop.com

ఇక ప్రస్తుతం సి‌ఎంగా ఉన్న రేవంత్ రెడ్డి సిఎల్పీ నేతగా కూడా కొనసాగుతున్నారు.ఈ నేపథ్యంలో టీపీసీసీ చీఫ్ పదవి నుంచి రేవంత్ రెడ్డి ని తప్పించే అవకాశం ఉందని ఈ మద్య వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి.

ఎందుకంటే సి‌ఎం పదవిలో ఉన్నవారిని అధ్యక్ష పదవిలో కొనసాగించడం కాంగ్రెస్ సంప్రదాయంలో లేని అంశం.అందుకే రేవంత్ రెడ్డిని పక్కన పెట్టి ఆ బాధ్యతను ఎవరో ఒకరి  భుజాన వేసే అవకాశం ఉందనే టాక్ నడిచింది.

Telugu Bcs, Congress, Rahul Gandhi, Revanth Reddy, Tpcc, Ts-Politics

ముఖ్యంగా కుల సమీకరణలను దృష్టిలో ఉంచుకోని బీసీ నేతకు టీపీసీసీ( TPCC ) పదవి అప్పగించే అవకాశం ఉందని టాక్ వచ్చింది.అయితే మరో నాలుగు నెలల్లో లోక్ సభ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో  మార్పులు చేసేందుకు అధిష్టానం సిద్దమౌతుందా అంటే ముమ్మాటికి ఆ సాహసం చేయదనే వాదన గట్టిగా వినిపిస్తోంది.ఎందుకంటే ఈసారి లోక్ సభ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి అత్యంత కీలకం.ఈసారి ఎలాగైనా కేంద్రంలో అధికారంలోకి రావాలని గట్టి పట్టుదలగా ఉంది. తెలంగాణలో 11 లోక్ సభ స్థానాలు ఉండగా ఈసారి అన్నీ స్థానాలను కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది.

Telugu Bcs, Congress, Rahul Gandhi, Revanth Reddy, Tpcc, Ts-Politics

ఈసమయంలో టీపీసీసీ చీఫ్ పదవిలో మార్పులు చేపడితే ఆ ప్రభావం పార్టీపై పడే అవకాశం ఉంది.అందుకే లోక్ సభ ఎన్నికలు పూర్తయ్యే వరకు రేవంత్ రెడ్డిని టీపీసీసీ చీఫ్ గా కొనసాగించే ఆలోచనలో కాంగ్రెస్ అధిష్టానం ఉన్నట్లు టాక్.ఆల్రెడీ టీపీసీసీ చీఫ్ గా ఉన్న రేవంత్ రెడ్డి( Revanth reddy ) ముఖ్యమంత్రిగాను సీఎల్పి నేతగాను బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

దీన్ని బట్టి చూస్తే తెలంగాణలో కాంగ్రెస్ భారమంతా రేవంత్ రెడ్డి పైనే ఉన్నట్లు స్పష్టంగా అర్థమౌతుంది.ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డిని టీపీసీసీ పదవి నుంచి తప్పించి సాహసం ముమ్మాటికి చేసే అవకాశం లేదు.

మరి ముందు రోజుల్లో టి కాంగ్రెస్ నాయకత్వ బాధ్యతపై అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube