శిధిలావస్థలో పశువుల దవాఖాన హడలి పోతున్న సిబ్బంది...!

యాదాద్రి భువనగిరి జిల్లా: బొమ్మలరామరం మండల కేంద్రంలో పురాతన కాలంలో నిర్మంచిన రెండు గదుల పశు వైద్యశాల ప్రస్తుతం శిథిలావస్థకు చేరి, ఏ క్షణమైనా కూలిపోయే స్థితికి చేరుకున్నా గత పదేళ్ళుగా పాలకులు పట్టించుకోలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.ఎంతో కాలం నుండి మండల కేంద్రంతో పాటు,పరిసర గ్రామాల పశువులకు ఈ ఆసుపత్రిలో వైద్యసేవలు అందిస్తున్నా కనీసం పట్టించుకున్న పాపాన పోలేదని,

 Staff Rushing To Cattle Clinic In Ruins, Cattle Clinic , Yadadri Bhuvanagiri, B-TeluguStop.com

ఇక్కడ పనిచేసే డాక్టర్లు,సిబ్బంది శిధిలమైన భవనంలో ఉండలేక బిక్కు బిక్కుమంటూ గడుపుతూ పశువులకు సరైన వైద్యసేవలు కూడా అందించలేకపోతున్నారని వాపోతున్నారు.

గత ప్రభుత్వాలు ఎన్నిసార్లు విన్నవించినా పశు వైద్యశాలపై దృష్టి సారించకపోవడం బాధాకరం అంటున్నారు.ఇప్పటికైనా అధికారులు స్పందించి కొత్త భవనానికి నిధులు మంజూరు చేసి ఆధునిక వసతులతో శాశ్వత భవనం నిర్మించాలని కోరుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube