అమెరికా లో ఉంటున్న భారతీయ ఎన్నారైలకి కొంత ఊరటని ఇచ్చేలా ట్రంప్ కార్యాలయ కీలక అధికారి హెచ్1 బీ వీసా జారీ విధానంపై ఒక స్పష్టమైన ప్రకటన చేశారు.వీసా జారీ ప్రక్రియ విధానంపై ఆయన చేసిన ప్రకటన ఇప్పుడు భారత ఐటీ నిపుణులకి ఊపిరి పీల్చుకునే విధంగా ఉందని నిపుణులు తెలుపుతున్నారు.
ఈ విషయంపై భారత ప్రభుత్వం మరింత చొరవ తీసుకుంటే ఎన్నారైలు ఇబ్బందులు పడకుండా ఉంటారని తెలిపారు.వివరాలలోకి వెళ్తే.
హెచ్1 బీ వీసాల జారీ ప్రక్రియలో ఎలాంటి మార్పులు చేయలేదని చేయబోమని అమెరికా స్పష్టం చేసింది.వచ్చేవారం ఢిల్లీలో భారత్, అమెరికా మధ్య జరిగే 2+2 చర్చల్లో వీసాల అంశాన్ని ప్రస్తావించాలని భారత్ భావిస్తోంది.ఈ విషయంపై గత నెలలో కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ రాజ్యసభలో మాట్లాడుతూ, వీసాల అంశంపై ఇప్పటికే పలుమార్లు వైట్‌హౌస్‌తో చర్చలు జరిపామని తెలిపారు.
అంతేకాదు వేరు వేరు వేదికలపై ఈ వీసా విధాన సమస్యని చర్చలకి తీసుకు వచ్చామని మంత్రి స్పష్టం చేశారు.
సెప్టెంబరు 6న జరిగే చర్చల్లో దీనిపై చర్చిస్తామన్నారు…చర్చల్లో వీసాల అంశాన్ని తీసుకొచ్చే ఏర్పాట్లలో భారత్ ఉందని.ఈ విషయంలో మార్పులు లేకపోవడం వలన మాట్లాడటానికి కూడా ఏమి ఉండదని ట్రంప్ కార్యాలయ కీలక అధికారి స్పష్టం చేశారు.