ఇకపై బాబుకి పవన్ సపోర్ట్ కరువే..!

జనసేన అధినేత పవన్ కల్యాణ్( Janasena Leader Pawan Kalyan ) మరియు టీడీపీ అధినేత చంద్రబాబు మద్య మంచి సన్నిహిత్యం ఉన్న సంగతి తెలిసిందే.ఈ ఇద్దరు అధినేతలు వచ్చే ఎన్నికల్లో కలిసి వెళ్లాలని ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నారు.

 Will Pawan Kalyan Supports Chandrababu On It Notices,chandrababu Naidu,pawan Kal-TeluguStop.com

కానీ పొత్తు దిశగా వేస్తున్న అడుగులు మాత్రం సఫలం కావడం లేదు.అయితే వచ్చే ఎన్నికల్లో జగన్ ను గద్దె దించాలంటే చంద్రబాబుతో కలవక తప్పదని అందుకే పొత్తు తప్పనిసరి అని పవన్ ఇప్పటికే చాలాసార్లు స్పష్టం చేశారు కూడా.

అయితే ప్రస్తుతం చంద్రబాబు చుట్టూ అలుముకున్న అనూహ్య పరిణామాలు పవన్ ను దూరం చేసేలా కనిపిస్తున్నాయి.

Telugu Amaravati, Ap, Chandrababu, Janasena, Pawan Kalyan-Politics

చంద్రబాబు( TDP Chandrababu Naidu ) ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడూ అమరావతి రాజధాని నిర్మాణంలో రూ.118 కోట్ల అవినీతి జరిగిందని ఆ డబ్బు అంతా స్వయంగా చంద్రబాబు చేతికి అందిందని అవినీతి నిరోధక శాఖ నోటీసులు జారీ చేసింది.దీనికి సంబంధించి పక్కా ఆధారాలు ఉండడంతో టీడీపీ శ్రేణులు( TDP Activists ) గాని చంద్రబాబు గాని నోరు మెదపడం లేదు.

దీంతో బాబు అరెస్ట్ కాయం అని వైసీపీ గట్టిగా చెబుతోంది.అటు చంద్రబాబు కూడా తాను అరెస్ట్ అవుతానేమో అనే సందేహాలను వెళ్ళబుచ్చుతున్నారు.దీంతో ఆయన దోస్తీ కోరుకుంటున్న పవన్ వైఖరి ఎలా ఉండబోతుందనేది ఆసక్తికరంగా మారింది.

Telugu Amaravati, Ap, Chandrababu, Janasena, Pawan Kalyan-Politics

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పొత్తు కు సంబంధించి ఎలాంటి వ్యాఖ్యలు చేసిన ఇరకాటంలో పడతామని జనసేన అధినేత భావిస్తున్నారట.బాబు నోటీసులపై పవన్ ఇంతవరకు స్పందించలేదని తెలుస్తోంది.ప్రస్తుతం ఐటీ నోటీసులతో చంద్రబాబు ఇమేజ్ గట్టిగానే డ్యామేజ్ అయింది.

ఇంకా ముందు రోజుల్లో ఆయన అరెస్ట్ కూడా గ్యారెంటీ అనే వాదన వినిపిస్తోంది.ఈ నేపథ్యంలో టీడీపీతో దోస్తీ కోరిన జనసేన నష్టపోక తప్పదు.

అందుకే టీడీపీతో వీలైనంతా దూరం పాటించలంటి పవన్ భావిస్తున్నారట.మరి ముందు రోజుల్లో ఈ రెండు పార్టీల మద్య పొత్తు కుదురుతుందా లేదా అనేది చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube