తెలంగాణలో నిరుద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది.డీఎస్సీ పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఈ మేరకు 5,089 టీచర్ల పోస్టులను విద్యాశాఖ భర్తీ చేయనుంది.
ఈనెల 20 నుంచి అక్టోబర్ 21 వ తేదీ వరకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులను స్వీకరించనుంది.
నవంబర్ 20వ తేదీ నుంచి 30వ తేదీ వరకు పరీక్షలను నిర్వహించనున్నట్లు నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.సీబీటీ విధానంలో పరీక్షలు జరగనుండగా అభ్యర్థుల దరఖాస్తు రుసుము రూ.1000 గా ఉంది.అదేవిధంగా అభ్యర్థుల వయసు ఆగస్ట్ 1 నాటికి 18 నుంచి 44 సంవత్సరాలు ఉండాలని నోటిఫికేషన్ లో వెల్లడించారు.
పూర్తి సమాచారాన్ని ఈనెల 20 నుంచి అధికారిక వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచనున్నారు.







