బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్( CM KCR ) ఎన్నికల కథన రంగంలోకి దూకారు.నేటి నుంచి ఆయన వరుసగా ఎన్నికల ప్రచార సభలు, సమావేశాలు, నియోజకవర్గాల పర్యటనలు చేపట్టనున్నారు .
అలాగే బీజేపీ కాంగ్రెస్ లకు దీటుగా బీ ఆర్ ఎస్ ను( BRS ) సిద్ధం చేస్తున్నారు పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నింపే విధంగా వారంతా ప్రజల్లోకి వెళ్లి , పార్టీ ఎన్నికల హామీలు, ఇప్పటివరకు ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి ఇలా అన్నిటిని వివరించే విధంగా ప్రణాళిక రచించారు .అలాగే ఈరోజు మధ్యాహ్నం 12:15 నిమిషాలకు బీఆర్ఎస్ మేనిఫెస్టోను( BRS Manifesto ) ఆవిష్కరించనున్నారు .ఈ మ్యానిఫెస్టోలో రైతులు, మహిళలు , దళితులు, గిరిజనలు ,బీసీలు, మైనారిటీలకు ఎక్కువ ప్రాధాన్యం కల్పించనున్నారు.ఆసరా పింఛన్లు, రైతుబంధు సాయం పెంపు ,యువతను ఆకర్షించే విధంగా అనేక హామీలు ఇవ్వనున్నట్లు సమాచారం.
వీటితోపాటు రైతులకు పెన్షన్, కౌలు రైతులకు ఆర్థిక సహాయం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, బడుగు బలహీన వర్గాల వారికి మరిన్ని ఆర్థిక సహాయాలు అందించడం వంటివి మేనిఫెస్టోలో ఉండబోతున్నట్లు సమాచారం .ఈ మేనిఫెస్టో విడుదల చేసిన వెంటనే కేసీఆర్ ఎన్నికల ప్రచార సభలో పాల్గొని మేనిఫెస్టోను హైలెట్ చేసే విధంగా ప్రసంగాలు చేయబోతున్నారట.ఈరోజు హుస్నాబాద్ లో( Husnabad ) సాయంత్రం నాలుగు గంటలకు జరిగే బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొననున్నారు. జనగామ, భువనగిరిలలో కేసీఆర్ బహిరంగ సభలు నిర్వహించనున్నారు .17 సిద్దిపేట , సిరిసిల్లలో, 18 మధ్యాహ్నం రెండు గంటలకు జడ్చర్లలో, సాయంత్రం నాలుగు గంటలకు మేడ్చల్ బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొని ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు.
తెలంగాణలో కాంగ్రెస్( Congress ) ఎన్నికల మేనిఫెస్టో ఆ పార్టీని అధికారంలోకి తీసుకురావడంతో, తెలంగాణలోనూ ఆ తరహా మేనిఫెస్టోని ప్రకటించేందుకు కాంగ్రెస్ అధిష్టానం సిద్ధం అవుతుండడం, ఇప్పటికే ఆరు హామీలను ప్రకటించిన నేపథ్యంలో, కాంగ్రెస్ పై పై చేయి సాధించే విధంగా కేసీఆర్ కొత్త మేనిఫెస్టోపై ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టినట్లు సమాచారం.ప్రస్తుతం కాంగ్రెస్ తమ ఎన్నికల మేనిఫెస్టోపై చాలా ఆశలు పెట్టుకుంది.ఇప్పటికే ప్రకటించిన ఆరు ప్రధాన హామీలు తమను అధికారంలోకి తీసుకొస్తాయని నమ్ముతోంది.
అయితే బిఆర్ఎస్ తమను దెబ్బ కొట్టే విధంగా మేనిఫెస్టోను విడుదల చేయబోతుండడం కాంగ్రెస్ కు ఆందోళన కలిగిస్తుంది.