కంగ‌నాకు ఈ ధైర్యం ఎక్క‌డిది.. ఆమె వెన‌క ఉన్న బ‌డా నేత ఎవ‌రు...?

బాలీవుడ్ ఫైర్‌బ్రాండ్‌, హీరోయిన్ కంగ‌న ర‌నౌత్ వ‌ర్సెస్ మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం మ‌ధ్య రోజు రోజుకు వార్ ముదురుతోంది.ఈ నేప‌థ్యంలో ముంబై పీవోకేగా మారింద‌ని కంగ‌న విమ‌ర్శ‌లు చేయ‌డం.

 Who Is Behind Kangana Ranaut Steps, Kangana Ranaut,bollywood,shiva Sena,sushanth-TeluguStop.com

ఆమెకు కేంద్ర ప్ర‌భుత్వం వై కేట‌గిరి భ‌ద్ర‌త క‌ల్పించ‌డంతో బీజేపీ వ‌ర్సెస్ శివ‌సేన మ‌ధ్య కూడా వార్ తీవ్ర‌మ‌వుతోంది.కంగ‌న స‌వాల్ చేసి మ‌రీ ముంబైలో అడుగు పెట్ట‌డం శివ‌సేన‌కు షాక్ అయ్యింది.

కంగ‌నాకు షాక్ ఇచ్చేలా క‌ర్ణిక ఆఫీస్‌లో కొంత భాగం అక్ర‌మ క‌ట్ట‌డం ఉంద‌ని… ముంబై కార్పొరేష‌న్ దానిని కూల్చివేసిన సంగ‌తి తెలిసిందే.

ఇక తాజాగా శివ‌సేన త‌న అధికార ప‌త్రిక అయిన సామ్నాలో కంగ‌నాపై తీవ్రంగా విరుచుకు ప‌డింది.

ఆమెకు వై కేట‌గిరి భ‌ద్ర‌త క‌ల్పించ‌డాన్ని త‌ప్పుప‌ట్టింది.ఇక ముంబై ప్ర‌తిష్ట‌ను దెబ్బ‌తీసే కుట్ర జ‌రుగుతోంద‌ని మండిప‌డ్డ సామ్నా… ముంబైను ఆర్థికంగా బ‌ల‌హీన‌ప‌రిచే కుట్ర‌లు ఢిల్లీలో జ‌రుగుతున్నాయ‌ని వ్యాఖ్యానించింది.

ఇక ముంబైను మ‌హారాష్ట్ర నుంచి విడ‌దీసే ప్ర‌య‌త్నాలు కూడా ఉన్నాయంటూ త‌న సంపాద‌కీయంలో వ్యాఖ్యానించింది.ఈ చ‌ర్య‌ల‌ను తిప్పి కొట్టేందుకు మ‌హారాష్ట్ర ప్ర‌జ‌లు ఎప్పుడూ అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సూచించింది.

అంతే కాకుండా ముంబైను, మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రిని అవ‌మానించిన కంగానాకు బీజేపీ మ‌ద్ద‌తు ప‌ల‌క‌డంపై శివ‌సేన తీవ్ర అస‌హ‌నం వ్య‌క్తం చేసింది.కంగ‌నాకు త్వ‌ర‌లోనే బుద్ధి చెపుతామ‌ని వార్నింగ్ ఇవ్వ‌డంతో పాటు ఆమెకు ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీ అండ‌దండలు ఉన్నాయ‌ని కూడా ఆరోపించింది.

ఇక త‌మ ప్ర‌భుత్వాన్ని అస్థిర‌ప‌రిచేందుకు ఉన్న ఏ చిన్న అవ‌కాశం కూడా బీజేపీ వ‌దులుకోవ‌డం లేద‌ని శివ‌సేన ఆరోపించింది.ఇక బిహార్ ఎన్నిక‌ల కోసం సుశాంత్‌ను వాడుకుంటోన్న బీజేపీ.

ఇప్పుడు కంగ‌నాను కూడా రాజ‌కీయంగా వాడుకుంటోంద‌ని చెప్పింది.

జ‌రుగుతోన్న ఈ సంఘ‌ట‌న‌లు అన్ని చూస్తే కంగ‌నా త్వ‌ర‌లోనే రాజ‌కీయాల్లోకి వ‌స్తుంద‌ని.

బీజేపీ మ‌హారాష్ట్రలో శివ‌సేన‌ను ఢీ కొట్టేందుకు సోనూసుద్‌, కంగ‌నా లాంటి సినీగ్లామ‌ర్‌ను వాడుకునే స్కెచ్ వేస్తోంద‌న్న చ‌ర్చ‌లు జాతీయ మీడియాలో వినిపిస్తున్నాయి.ఇక కంగ‌నా సైతం మ‌రాఠా ప్ర‌జ‌లు త‌న‌కు స‌పోర్ట్ చేస్తున్నార‌ని చెప్పింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube