తెలుగు సినీ పరిశ్రమలో మెగా స్టార్ చిరంజీవికి ఉన్నటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ మరియు క్రేజ్ గురించి కొత్తగా సినీ ప్రేక్షకులకి తెలియజేయాల్సిన అవసరం లేదు.60 సంవత్సరాలు పైబడినా మెగాస్టార్ చిరంజీవి ఇప్పటికీ తనలో ఏ మాత్రం ఎనర్జీ తగ్గకుండా యంగ్ హీరో లాగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్నాడు.
అయితే తాజాగా మెగాస్టార్ చిరంజీవి కి సంబంధించినటువంటి ఓ ఫోటో సోషల్ మీడియా మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది.ఇంతకీ ఆ ఫోటో ని పరిశీలించినట్లయితే ఆ ఫోటోలో మెగాస్టార్ చిరంజీవి టాలీవుడ్ ప్రముఖ నటుడు సాయి కుమార్ కొడుకు ఆది ని ఎత్తుకొని తీసుకున్నట్లు తెలుస్తోంది.
దీంతో కొందరు మెగా అభిమానులు మెగాస్టార్ చిరంజీవి ఒకప్పటి ఫోటోని సోషల్ మీడియా మాధ్యమాల్లో బాగానే షేర్ చేస్తూ ట్రెండింగ్ చేస్తున్నారు.అంతేగాక ఈ ఫోటోని సోషల్ మీడియా మాధ్యమాల్లో షేర్ చేసిన అనతి కాలంలోనే దాదాపుగా లక్షల సంఖ్యలో లైకులు వచ్చాయంటే అర్థం చేసుకోవచ్చు సోషల్ మీడియాలో మెగాస్టార్ చిరంజీవికి ఉన్న ఫాలోయింగ్ గురించి.
ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న “ఆచార్య” అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు.అయితే ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు కానుకగా ఈ చిత్రానికి సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది.
కాగా మరోవైపు మెగాస్టార్ మలయాళంలో మంచి విజయం సాధించినటువంటి “లూసిఫర్’ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.
అయితే ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి ఓ ప్రముఖ రాజకీయ నాయకుడి పాత్రలో కనిపించనున్నట్లు టాలీవుడ్ సినీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.
కానీ మెగాస్టార్ చిరంజీవి మాత్రం ఈ విషయంపై ఇప్పటి వరకు స్పందించ లేదు.దీంతో మెగాస్టార్ లూసిఫర్ రీమేక్ పై వస్తున్నటువంటి ఈ వార్తల్లో నిజమెంతో అనేది ఇంకా తెలియాల్సి ఉంది.