ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) చీఫ్ కు కూడా కరోనా బెంగ తప్పలేదు.కరోనా పై పోరాటం లో ప్రపంచ దేశాలను అప్రమత్తం చేస్తున్న WHO చీఫ్ డైరక్టర్ జనరల్ టెడ్రోస్ అధనోమ్ కు సైతం కరోనా బెంగ పట్టుకుంది.
తాజాగా కోవిడ్-19 పాజిటివ్ అని తేలిన వ్యక్తిని ఇటీవల తాను కలిశానని ఈ నేపథ్యంలో తాను స్వీయ నిర్బంధంలోకి వెళుతున్నట్లు ఆయన తాజాగా ప్రకటించారు.ఇటీవల తనను కలిసిన ఒక వ్యక్తికి తాజాగా కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించడం తో అతడికి కరోనా నిర్ధారణ అయ్యింది అని అందుకే తాను స్వీయ నిర్బంధంలోకి వెళుతున్నట్లు టెడ్రోస్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
కరోనా బాధిత వ్యక్తిని కలిసిన నేపథ్యంలోనే స్వీయ నిర్బంధంలోకి వెళుతున్నానని అయితే తనకు ఎలాంటి కరోనా లక్షణాలు మాత్రం లేవంటూ ఆయన స్ఫష్టం చేశారు.గత కొద్దీ నెలలుగా ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా మహమ్మారి కి ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) తీవ్ర కృషి చేస్తున్న విషయం విదితమే.
ఈ మహమ్మారి కట్టడి కోసం వివిధ దేశాలు అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్ తయారీ పై కూడా WHO శ్రద్ద చూపుతూ కరోనా కట్టడి కోసం తమ వంతు ప్రయత్నాలు చేస్తూనే ఉంది.ప్రస్తుతం ఉన్న పరిస్థితులను ఎప్పటికప్పుడు దేశాలకు సమాచారం అందించి వారిని అప్రమత్తం చేస్తూ తీవ్రంగా శ్రమిస్తోంది.
అయితే కరోనా బాధిత వ్యక్తిని కలిసిన కారణంగా WHO మార్గదర్శకాలను అనుసరించి కొన్ని రోజుల పాటు క్వారంటైన్ లో ఉండనున్నట్లు ఆయన సోమవారం ట్విట్టర్ ద్వారా తెలిపారు.ఈ కొద్ది రోజులు కూడా ఇంటి నుంచే తమ విధులను నిర్వర్తించనున్నట్లు ఆయన స్పష్టం చేశారు.
కరోనా ప్రతి ఒక్కరిని కూడా భయాందోళనకు గురి చేస్తుంది.కరోనా బాధిత వ్యక్తి మన మధ్య ఉన్నాడు అంటేనే భయపడి పోయి దాక్కొనే పరిస్థితులు ఎదురవుతున్నాయి.
అయితే కరోనా పరిస్థితులపై ఎప్పటికప్పుడు అవగాహన కల్పించే WHO చీఫ్ కే కరోనా బెంగ ఏర్పడడం మాత్రం గమనార్హం.తాను స్వీయ నిర్బంధంలోకి వెళుతున్న ప్రకటించిన టెడ్రోస్ కరోనావైరస్ వ్యాప్తిని నిరోధించడానికి అవసరమైన మార్గదర్శకాలను మనమంతా విధిగా పాటించాలని, తద్వారా మాత్రమే కరోనా వ్యాప్తికి సంబంధించిన లింక్ ను ఛేదించగలుగుతామని ఆయన ట్వీట్ చేశారు.