అఖిల్ సినిమాతో ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చిన అఖిల్ అక్కినేని( Akhil Akkineni ) అప్పటి నుంచి ఇప్పటి వరకు సరైన సక్సెస్ లేక చాలా ఇబ్బంది పడుతున్నాడు.తన లాస్ట్ సినిమా అయిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ తో ఒకే అనిపించినా కూడా అంతకి మించి హిట్ కొట్టాలని ఏజెంట్ తో( Agent Movie ) ఆడియెన్స్ ముందుకు వచ్చారు .
అయితే ఈ సినిమాకు కొంత నెగిటివ్ టాక్ వస్తుంది .అసలు సినిమాకి కథే పెద్ద డ్రాబ్యాక్ అంటున్నారు … అఖిల్ బాడీ, లుక్కు ఎంత బాగున్నా .కథలో దమ్ము లేకపోతె ఎలా అని ప్రశ్నిస్తున్నారు మాఫియా సిండికేట్… భారత గూఢచారి సంస్థలో స్పై హీరో సిండికేట్ కొమ్ములు వంచే హీరోయిజం ఇవన్నీ చాలా సార్లు చూశామని అంటున్నారు .
అంతేకాక కధనం లోను దమ్ము లేదని చెబుతున్నారు .సినిమా కోసం ఎక్కడికెక్కడికో వెళ్లారు .భారీగా యాక్షన్ సీన్లు పెట్టారు… కానీ స్టోరీ, ప్రజెంటేషన్ సరిగ్గా లేకపోవడం మైనస్ అయ్యాయని అంటున్నారు .సంగీతం సరిగా లేక, ఫన్ లేక, వావ్ అనిపించే సీన్లు లేక, కథనం గ్రిప్పింగుగా లేక… ఏదీ సరిగ్గా లేక సినిమా సరిగ్గా లేకుండా పోయింది అంటున్నారు…సినిమాలో మెయిన్ ప్లాట్ వైవిధ్యమైనది కాకపోయినా.కనీసం ఇంట్రస్ట్ గా అయిన సాగాలి.
ఈ కథలో అది కూడా మిస్ అయిందని చెబుతున్నారు.దర్శకుడిగా సురేందర్ రెడ్డి( Director Surender Reddy ) మంచి కథా నేపథ్యం రాసుకున్నప్పటికీ.
అక్కడక్కడ బోర్ గా సాగే సన్నివేశాలు కొంత ఇబ్బందిని కలిగిస్తాయని … ఈ చిత్రం చూస్తున్నంత సేపు రెగ్యులర్ యాక్షన్ డ్రామాలే గుర్తుకువస్తాయని సినిమా చూసిన ఆడియెన్స్ పేర్కొంటున్నారు…సినిమా ఎక్కువ భాగం యాక్షన్ అండ్ ఇన్విస్టిగేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ లో సాగినా ఎక్కడా కూడా తర్వాత ఏంటి అనే ఉత్కంఠ లేకపోవడం .ఈ సినిమాకి మరో బలహీనత అంటున్నారు.సినిమా మాస్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యే జోనర్ అయినప్పటికీ దర్శకుడు మాత్రం అక్కడక్కడ ఆకట్టుకునే యాక్షన్ ను తప్ప.
మాస్ ఆడియన్స్ ను ఆకట్టుకునే ఎలిమెంట్స్ ను సినిమాలో ఎస్టాబ్లిష్ చేయలేకపోయారని చెబుతున్నారు .సరైన కధా, కధనాలు ఎంచుకోలేకపోవడమే అఖిల్ కి ఇబ్బందిగా మారిందన్న టాక్ బలంగా వినిపిస్తుంది మొదటి రోజే ఇలా అఖిల్ సినిమా మీద నెగిటివ్ టాక్ రావడం నిజంగా చాలా భాడని కలిగించే విషయం అనే చెప్పాలి…ఇక ఇదంతా చూస్తున్న అక్కినేని అభిమానులు మాత్రం ఇదంతా కావాలనే కొందరు నెగిటివ్ పబ్లిసిటీ చేయిస్తున్నారు.అంతే తప్ప సినిమా చాలా బాగుంది అని అంటున్నారు…
.