బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్( CM KCR ) వ్యవహార శైలి ఒక పట్టాన ఎవరికి అర్థం కాదు.ఎప్పుడు ఏ నిర్ణయం ఎందుకు తీసుకుంటారో ఎవరికి అర్థం కాదు.
సొంత పార్టీ నాయకులకు ఇది అర్థం కాని పరిస్థితి.తొమ్మిదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తూ వస్తున్న కేసీఆర్ మొదటి నుంచి సచివాలయానికి వచ్చింది లేదు.
ఎక్కువగా ప్రగతి భవన్ లోని ముఖ్యమంత్రి కార్యాలయంలోనే ఉంటూ, అక్కడి నుంచి పరిపాలన కొనసాగిస్తున్నారు .ఈ విషయంలో ఎన్ని విమర్శలు వచ్చినా, కేసీఆర్ మాత్రం ఈ విషయం లో పట్టించుకోనట్టుగానే వ్యవహరిస్తూ వస్తున్నారు.ఇక మంత్రులు , ఎమ్మెల్యేలు ఇతర నాయకులు కేసీఆర్ ను కలిసి తమ తమ నియోజకవర్గాల్లో పరిస్థితులను వివరించి తమ సమస్యలను చెప్పుకునేందుకు అవకాశం లేకుండా పోయింది.ప్రగతి భవన్ నుంచి పిలుపు వచ్చిన వారికి మాత్రమే అవకాశం ఏర్పడేది.
ఈ విధానంపై పార్టీ నాయకుల్లో బాగా అసంతృప్తి పెరిగిపోయింది.
ఇటీవల కాలంలో బీ ఆర్ ఎస్( BRS party ) నుంచి వలసలు పెరిగిపోతుండడం తదితర పరిణామాలను లెక్కల్లోకి తీసుకుని తను వ్యవహార శైలిలో మార్పు చేర్పులు చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తుంది.ఈ మేరకు ఏప్రిల్ 30వ తేదీ నుంచి కొత్త సచివాలయం ప్రారంభం( New Secretariat ) కాబోతోంది.6 వ అంతస్థులో కేసీఆర్ తన కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకున్నారు.
ఇకపై సచివాలయం లోపలికి మంత్రులు, ఎమ్మెల్యేలు సులువుగా వెళ్లేందుకు అవకాశం కల్పించబోతున్నారట.కేసిఆర్ వీలుని బట్టి ఆయనను కలిసేందుకు ఇకపై మంత్రులు, ఎమ్మెల్యేలు ఇతర కీలక నాయకులకు అవకాశం ఇవ్వాలని కేసీఆర్ నిర్ణయించుకున్నారు.కొత్త సచివాలయం నుంచి ఈ విధానాన్ని పాటించబోతుండడం తో ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గ సమస్యలను అధినేతకు చెప్పుకునేందుకు అవకాశం ఏర్పడబోతోంది. సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో కెసిఆర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా అర్దం అవుతోంది.