ఇస్మార్ట్ బ్యూటీ ఎక్కడ..?

కన్నడ లో వజ్రకాయ సినిమాతో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన నభా నటేష్ తెలుగులో సుధీర్ బాబు తో నన్ను దోచుకుందువటే సినిమాతో పరిచయమైంది.అందం అభినయం రెండు ఉన్న అమ్మడు టాలీవుడ్ ని ఓ ఊపు ఊపేస్తుందని అనుకున్నారు.

 Where Is Ismart Beauty Nabha Natesh Nabha Natesh, Ismart Shanker, Ram , Tollywoo-TeluguStop.com

ఇస్మార్ట్ శంకర్ సినిమాతో మాస్ ఆడియెన్స్ కు దగ్గరైన నభా నటేష్ ఆ తర్వాత వెంట వెంట ఛాన్సులు అందుకుంది.రవితేజ డిస్కో రాజా, సాయి తేజ్ సోలో బ్రతుకే సో బెటర్, బెల్లంకొండ శ్రీనివాస్ అల్లుడు అదుర్స్ సినిమాల్లో నటించింది నభా నటేష్.

ఆ సినిమాలేవి అమ్మడికి కలిసి రాలేదు.లాస్ట్ ఇయర్ నితిన్ హీరోగా వచ్చిన అందాధున్ రీమేక్ మాస్ట్రో సినిమాలో మెరిసింది ఈ చిన్నది.

ఆ సినిమా కూడా జస్ట్ యావరేజ్ గా నిలిచింది.ఆ దెబ్బతో అమ్మడికి అవకాశాలు లేకుండా పోయాయి.

చేసిన సినిమాలేవి బాక్సాఫీస్ దగ్గర సందడి చేయకపోవడంతో నభా నటేష్ పై బ్యాడ్ మార్క్ పడ్డది.అందుకే ఆమె అవకాశాలు అడుగుతున్నా సరే కాదని అంటున్నారట.

సరైన ఛాన్స్ ఇవ్వాలే కానీ ఏ రేంజ్ లో అయినా రెచ్చిపోయేందుకు రెడీ అంటుంది నభా నటేష్.మరి నభా కి అలాంటి ఛాన్స్ ఎవరి ఇస్తారో చూడాలి.

ప్రస్తుతం ఒకటి రెండు ప్రాజెక్ట్ లు డిస్కషన్ స్టేజ్ లో ఉన్నట్టు టాక్.చేతిలో సినిమాలు లేకపోయినా తన రెగ్యులర్ అప్డేట్స్ తో ఫోటో షూట్స్ తో ఆడియెన్స్ కి టచ్ లోనే ఉంటుంది ఇస్మార్ట్ బ్యూటీ.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube