ఈ ఐపీఎల్ సీజన్లో చివరి రెండు స్థానాల్లో నిలిచే అవకాశం ఉన్న జట్లు ఏవంటే..?

ఐపీఎల్ సీజన్( IPL ) అట్టహాసంగా ప్రారంభమై వారం రోజులు గడిచాయి.కొన్ని జట్లు అద్భుతంగా రాణించి లీగ్ పాయింట్ల పట్టికలో( League Points ) ముందంజలో ఉండగా.

 What Are The Teams That Are Likely To Finish In The Last Two Positions Of This I-TeluguStop.com

మరికొన్ని జట్లు పేలవ ఆట ప్రదర్శన చేసి వెనుకంజలో కొనసాగుతున్నాయి.అయితే మొదటివారం జరిగిన మ్యాచ్ల పరంగా పరిశీలిస్తే.

ఈ సీజన్లో చివరి రెండు స్థానాలలో హైదరాబాద్, ఢిల్లీ జట్లు నిలిచే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.

ఈ సీజన్ ప్రారంభానికి ముందు హైదరాబాద్, ఢిల్లీ ఫ్రాంచైజీలు( SRH DC ) తమ జట్లలో ఎన్నో మార్పులు చేసి లీగ్ లోకి అడుగుపెట్టాయి.

తొలి వారంలోనే రెండు జట్లు ఆటను ప్రదర్శించడంలో అట్టర్ ఫ్లాప్ అయ్యాయి.ఆడిన రెండు మ్యాచ్లలో ఓటములే ఎదురయ్యాయి.మ్యాచ్లో గెలవడం-ఓడటం అనేది పక్కన పెడితే మ్యాచ్లో ప్రత్యర్థి జట్టులను ఎదుర్కోవడం లోనే ఆ జట్టు సత్తా ఏంటో బయటపడుతుంది.

ఈ విషయంలో హైదరాబాద్, ఢిల్లీ జట్లు ప్రత్యర్థి జట్లకు ఎటువంటి గట్టి పోటీ ఇవ్వకుండానే ఓటములను సొంతం చేసుకున్నాయి.ఇంకా జరగాల్సి ఉన్న మ్యాచ్లలో ఆటతీరు ఇలాగే కొనసాగితే లీక్ పాయింట్ల టేబుల్ లో 9,10 స్థానాలలో నిలవడం ఖాయం.

ఐపీఎల్ చరిత్రలో పెద్దగా అంచనాలు లేని జట్టు ఏదంటే పంజాబ్ కింగ్స్ అని అందరికీ తెలిసిందే.అయితే జరిగిన రెండు మ్యాచ్లలో ఎటువంటి పొరపాటు చేయకుండా ప్రత్యర్థి జట్లను ఎదుర్కొని రెండు విజయాలను ఖాతాలో వేసుకుంది.శిఖర్ ధావన్ సారథ్యంలో పంజాబ్ జట్టు ఓ మేరకు మెరుగుపడిందనే చెప్పాలి.

తర్వాత కలకత్తా జట్టు మొదటి మ్యాచ్ లో ఓడిన.రెండవ మ్యాచ్ లో బెంగళూరు జట్టుపై మంచి విజయం సాధించింది.

హైదరాబాద్ జట్టు 2021 లో చివరి స్థానంలో.2022లో 8వ స్థానంలో నిలిచింది.ఈ సీజన్లో ఆట ప్రదర్శనలో మార్పు జరగకపోతే, ఈ సీజన్లో కూడా తొమ్మిది లేదా పదో స్థానంలో నిలిచే అవకాశాలు ఉన్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube