ఆ టీచర్ సలహాతో మలుపు తిరిగిన వెస్టిండీస్ క్రికెటర్ రోవ్‌మన్ పావెల్ జీవితం..!

క్రికెట్ లో అద్భుతంగా రాణిస్తున్న వెస్టిండీస్ క్రికెటర్ రోవ్‌మన్ పావెల్ … కెరియర్ మలుపు తిరగడానికి పీఈటీ టీచర్ ఇచ్చిన స్ఫూర్తి ప్రధాన కారణం.రోవ్ మేన్ తన జీవితంలో ఎన్నో కష్టాలు పడుతూ స్టార్ క్రికెటర్ గా ఎదిగాడు.

 West Indies Cricketer Rovman Powell Life Turned Around With That Teacher's Advi-TeluguStop.com

చిన్నప్పుడే తండ్రి చనిపోవడంతో తల్లి, చెల్లెలితో పెరిగిన పావెల్ కు చిన్నతనంలో తినడానికి కూడా తిండి లేక ఎన్నో కష్టాలు పడ్డాడు.చిన్నతనం నుండే తల్లి, చెల్లిని కష్టాలు లేకుండా చూసుకుంటానని తల్లికి మాట ఇచ్చాడు.

స్కూల్లో చదువుకుంటున్న రోజుల నుండి క్రికెట్ పై దృష్టి పెట్టాడు.ఇక తన కెరియర్ మలుపు తిరగడానికి పీఈటీ టీచర్ చెప్పిన మాటలే అని స్వయంగా తెలిపాడు.

Telugu Carlton, Rovman Powell, Century, Teacher, Cricket-Sports News క్ర�

పావెల్ క్రికెట్ మరియు ట్రాక్ అండ్ ఫీల్డ్, రెండిటిపై దృష్టి పెట్టడం గమనించిన టీచర్ ఒకదానిపై దృష్టి పెడితేనే జీవితంలో రాణించగలవు రెండిటిపై దృష్టి పెట్టుకుంటే ఎటు కాకుండా పోతావని వివరించాడు.కానీ పావెల్ ట్రాక్ అండ్ ఫీల్డ్ ట్రైనింగ్ కు వెళ్లాడు.అనుకోకుండా పీఈటీ టీచర్ కార్ల్టన్, తనను గమనించి నీకు ఈ ఫీల్డ్ సెట్ కాదు కేవలం క్రికెట్ పై దృష్టి పెడితేనే నీకు భవిష్యత్తు ఉంటుందని వార్నింగ్ ఇచ్చాడు.

Telugu Carlton, Rovman Powell, Century, Teacher, Cricket-Sports News క్ర�

ఇక టీచర్ చెప్పిన మాటలను సీరియస్ గా తీసుకొని క్రికెట్ లోనే రాణించాలని నిర్ణయం తీసుకున్నాడు.2016లో ఇంటర్నేషనల్ క్రికెట్ లోకి అడుగుపెట్టిన పావెల్ వెస్టిండీస్ తరఫున 45 వన్డేలు, 55 టి20 మ్యాచ్ లు ఆడాడు.ఇక పావెల్ వన్డేల్లో ఒక సెంచరీ, టి20 లో ఒక సెంచరీ చేశాడు.

ఆరోజు టీచర్ చెప్పిన మాటలు వినకపోయి ఉంటే తాను జీవితంలో స్థిరపడలేకపోయానని, జీవితాంతం ఆ టీచర్ కు రుణపడి ఉంటానని, తన తల్లికి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నందుకు చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube