తెలుగు సినీ ఇండస్ట్రీలో నటుడుగా కమెడియన్ గా సహాయ నటుడుగా వివిధ పాత్రలలో నటిస్తూ మంచి ఆదరణ సొంతం చేసుకున్నటువంటి వారిలో సీనియర్ నటుడు వీకే నరేష్ ( Naresh )ఒకరు.ఈయన తరచూ ఏదో ఒక వివాదం ద్వారా వార్తలలో నిలుస్తుంటారు కొద్ది రోజుల వరకు తన మూడు పెళ్లిళ్ల గురించి, భార్యలకు విడాకులు ఇవ్వడం గురించి పెద్ద ఎత్తున వార్తలలో నిలిచారు.
అంతేకాకుండా మరో నటితో ఈయన రిలేషన్ లో ఉన్నారని పెళ్లి కూడా చేసుకోబోతున్నారంటూ తన వ్యక్తిగత కారణాలవల్ల వార్తలలో నిలిచారు.
![Telugu Ap, Tollywood, Vk Naresh, Ys Jagan, Ysrcp-Movie Telugu Ap, Tollywood, Vk Naresh, Ys Jagan, Ysrcp-Movie](https://telugustop.com/wp-content/uploads/2024/04/VK-Naresh-Tollywood-Ap-Politics-Ysrcp-social-media.jpg)
ఇక సినిమా ఇండస్ట్రీలో కూడా ఈయన తరచూ ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో ఉంటారు.అయితే ఇటీవల కాలంలో వివాదాలకు కాస్త దూరంగా ఉన్నటువంటి నరేష్ ఏపీ పాలిటిక్స్ ( AP Politics )పై సంచలన వ్యాఖ్యలు చేస్తూ ఏపీ రాజకీయాలలోకి వేలు పెట్టారు.ఇలా వివాదాలకు దూరంగా ఉంటే ప్రజలు నన్ను మర్చిపోతారు అనుకున్నారేమో అందుకే ఈయన ఏపీ పాలిటిక్స్ లోకి ఎంటర్ అవుతూ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం తీవ్ర దుమారం రేపుతున్నాయి.
![Telugu Ap, Tollywood, Vk Naresh, Ys Jagan, Ysrcp-Movie Telugu Ap, Tollywood, Vk Naresh, Ys Jagan, Ysrcp-Movie](https://telugustop.com/wp-content/uploads/2024/04/politics-VK-Naresh-Tollywood-Ap-Politics-Ysrcp-social-media.jpg)
ఆంధ్రప్రదేశ్లో త్వరలోనే ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో అందరి ఆసక్తి ఏపీ రాజకీయాలపైనే ఉంది ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అన్ని పార్టీ నేతలు ప్రచార కార్యక్రమాలలో బిజీగా ఉన్నారు.ఈ క్రమంలోనే ఈ ఎన్నికలపై కేవలం రాజకీయపరంగా మాత్రమే కాకుండా సినిమా ఇండస్ట్రీలో కూడా ఆసక్తి నెలకొంది.ఇలాంటి తరుణంలో నరేష్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.ఆంధ్రప్రదేశ్లో అధికార మార్పిడి జరగకముందే రక్తపాతం జరుగుతుందని నేను నమ్ముతున్నాను అంటూ ట్వీట్ చేశారు.ఇక ఈయన ట్వీట్ బట్టి చూస్తుంటే ఈసారి అధికారం మార్పిడి జరుగుతుంది అంటే అధికారంలో ఉన్నటువంటి వైసీపీ( YCP ) ఓడిపోతుందని, తద్వారా రక్తపాతం జరుగుతుందని ఈయన పరోక్షంగా వైసీపీని టార్గెట్ చేస్తూ ఈ పోస్ట్ చేశారని తెలుస్తోంద.ఏదిఏమైనా నరేష్ చేసిన ఈ ట్వీట్ వైరల్ అవుతుంది.
క్రైమ్ న్యూస్
అవీ...ఇవి
ప్రత్యేకం
![](https://telugustop.com//wp-content/themes/novapress-pro/tstop/img/youtube-subscribe-slide.gif)