ఒక ఖండం పొడుగుతా రన్ చేయడం అంటే అది ఎంత కష్టమో అర్థం చేసుకోవచ్చు.ఒక ఖండాన్ని కవర్ చేయడానికి చాలానే కిలోమీటర్లు పరిగెత్తాల్సి ఉంటుంది.అయితే ఈ సాహసాన్ని సాధించడానికి రస్ కుక్ ( Russ Cook )అనే వ్యక్తి పెద్ద రిస్కే చేశాడు.“హార్డెస్ట్ గీజర్” అని కూడా పిలిచే ఈ వ్యక్తి ఒక అసాధారణ అల్ట్రామారథాన్ రన్నర్.అతని ప్రస్తుత సాహసం ఏంటంటే, ఆఫ్రికా ఖండం మొత్తం పొడవును పరిగెత్తడం.నిజానికి అతను 99% పరిగెత్తాడు.ఇంకొక నాలుగు రోజులు పరిగెత్తితే అతను ఆఫ్రికా మొత్తం కవర్ చేసిన రన్నర్‌గా రికార్డు క్రియేట్ చేస్తాడు.
2023, ఏప్రిల్‌లో దక్షిణాఫ్రికా( South Africa ) నుంచి తన ప్రయాణాన్ని ప్రారంభించాడు.ట్యునీషియా( Tunisia ) వరకు దాదాపు 9000 మైళ్ల దూరం పరిగెత్తాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు.ఈ ప్రయాణం 16 దేశాల గుండా సాగుతుంది.
ఎడారులు, వర్షారణ్యాలు, సవన్నాలు, పర్వతాలు, అరణ్యాలతో సహా అత్యంత సవాలుగా ఉన్న వాతావరణాల గుండా వెళ్ళాలి.గత 345 రోజులలో, రస్ ఖండంలో దాదాపు 376 మారథాన్లను పూర్తి చేశాడు.
వీసా సమస్యలు, అనారోగ్యం, దోపిడీ వంటి అడ్డంకులను ఎదుర్కొన్నాడు.అయినా ఈ సాహసాన్ని పూర్తి చేయాలని దృఢ నిశ్చయంతో ఉన్నాడు.
ఇది ఒక పరుగు మాత్రమే కాదు, ప్రపంచంలో మార్పు తీసుకురావడానికి ఒక ప్రయత్నం.ఈ సాహసంతో రస్ ఆఫ్రికా గురించి అవగాహన పెంచుతున్నాడు.
స్థానిక సంఘాలకు సహాయం చేయడానికి డబ్బును సేకరించడం, ప్రజలకు ఏదైనా సాధ్యమని స్ఫూర్తినివ్వడం కూడా లక్ష్యంగా పెట్టుకున్నాడు.
రస్ కుక్ మూడు స్వచ్ఛంద సంస్థల కోసం నిధులు సేకరిస్తున్నాడు.ది రన్నింగ్ ఛారిటీ, శాండ్‌బ్లాస్ట్, వాటర్‌ఎయిడ్.ఇప్పటివరకు, అతని ప్రయత్నాలు 430,080 పౌండ్లు (సుమారు రూ.4.50 కోట్లు) సేకరించాయి.అతని లక్ష్యం 1,000,000 పౌండ్లు (సుమారు రూ.10 కోట్లు) సేకరించడం.అతని నిధుల సేకరణ పేజీ ద్వారా విరాళం ఇవ్వవచ్చు.ట్యునీషియాలోని బిజెర్టేలో రస్ తన లక్ష్యాన్ని చేరుకుంటాడు.ఈ విజయాన్ని ఒక భారీ పార్టీతో జరుపుకోవాలని ప్లాన్ చేస్తున్నాడు.బ్రిటిష్ పంక్ బ్యాండ్ సాఫ్ట్ ప్లే అతని గౌరవార్థం ప్రదర్శన ఇస్తుంది.
పార్టీ ఏప్రిల్ 7న బిజెర్టేలోని సిడి సేలం హోటల్లో జరుగుతుంది.