చెల్లా అయ్యావు దర్శకత్వంలో విష్ణు విశాల్, ఐశ్వర్య లక్ష్మి జంటగా నటించిన తాజా చిత్రం మట్టి కుస్తీ.ఈ సినిమా ఫ్యామిలీ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కబోతోంది.
ఆర్ టీ టీమ్ వర్క్స్, విష్ణు విశాల్ స్టూడియోస్ బ్యానర్ల పై మాస్ మహారాజా రవితేజ తో కలిసి హీరో విష్ణు విశాల్ కలిసి నిర్మించిన ఈ సినిమా డిసెంబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.అయితే సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో చిత్ర బృందం ప్రమోషన్స్ ను వేగవంతం చేసింది.
ఈ ప్రమోషన్స్ లో భాగంగానే తాజాగా విష్ణు విషయాలు ఈ సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.ఈ సందర్భంగా హీరో విష్ణు విశాల్ మాట్లాడుతూ.
మట్టి కుస్తీ అనేది భార్యాభర్తల ప్రేమ కథ. ఇందులో ముఖ్యంగా భార్యాభర్తల మధ్య జరిగే ఇగో కుస్తీ.
కేరళలో మట్టి కుస్తీ అనే స్పోర్ట్ ఉంది.ఇందులో హీరోయిన్ కేరళ అమ్మాయి.దాంతో ఆ సినిమాకు మట్టి కుస్తీ అనే పేరును పెట్టాము అని చెప్పుకొచ్చారు విష్ణు.అనంతరం రవితేజ గురించి మాట్లాడుతూ ఎఫ్ఐఆర్ సినిమాను తెలుగులో విడుదల చేసేటప్పుడు ఒక ఫ్యామిలీ ఫ్రెండ్ ద్వారా హీరో రవితేజ గారిని కలిశాను.
ఆయనకు నేను చేసే సినిమాలు చాలా నచ్చాయి.ఎఫ్ఐఆర్ ట్రైలర్ కూడా ఆయనకు బాగా నచ్చడంతో ప్రజెంట్ చేశారు.
అప్పుడు ఆ తర్వాత ఏం చేస్తున్నావని నన్ను రవితేజ గారు అడిగారు.అప్పుడు నేను మట్టి కుస్తీ సినిమా గురించి చెప్పాను.
వెంటనే ఆ సినిమా విజయం సాధిస్తుంది దానికి నేను ప్రొడ్యూస్ చేస్తానని రవితేజ గారు చెప్పారు.అలా మా జర్నీ మొదలైంది రవితేజ గారు నన్ను ఎంతో నమ్మారు.
నేను 13 ఏళ్లుగా తమిళ ఇండస్ట్రీలో ఉన్నాను కానీ ఏదైనా ఒక ప్రాజెక్టు గురించి ఎవరినైనా కలిస్తే నా బిజినెస్ మార్కెట్ గురించి మాట్లాడేవారు అడిగేవారు.అని రవితేజ గారు ఒక్క మీటింగ్లోనే నన్ను పూర్తిగా నమ్మారు.ఆయన నమ్మకం నాకెంతో కాన్ఫిడెంట్ ను ఇచ్చింది.ఆయనకు నా మనసులో ప్రత్యేక స్థానం ఉంది అని చెప్పుకొచ్చారు విష్ణు విశాల్.నా భార్య జ్వాలా సినిమాలు ఎక్కువ చూస్తుంది.కానీ నటన పట్ల ఆసక్తి లేదు.
ఇదివరకు ఎప్పుడో ఒక పాటలో కనిపించింది.ఆ విషయంలో ఇప్పటికీ రిగ్రేట్ ఫీలవుతూ ఉంటుంది అని చెప్పుకొచ్చాడు విష్ణు విశాల్.
ఇంకెప్పుడూ తనని నటించమని అడగొద్దని నవ్వుతూ చెప్పింది అని తెలిపారు విష్ణు విశాల్.