యూఏఈ లో నివాసం ఉంటున్న విదేశీ ఎన్నారైలు అందరికి ఆదేశ ప్రభుత్వం శుభవార్త తెలిపింది.వీసా గడువు ముగిసిన తరువాత కూడా తమ దేశంలో 90 రోజుల పాటు ఉండండి అంటూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ బంపర్ ఆఫర్ 1 ఆగస్టు 2018 నుంచి 31 అక్టోబర్ 2018 వరకు ఇది అమల్లో ఉంటుంది…అయితే ఈ మూడునెలల కాలంలో వీసాని సవరించుకోవాలని లేదంటే తమ దేశం విడిచి వెళ్ళిపోవాలని ఆదేశాలు జారీ చేసింది.
అయితే యూఏఈ ఈ విధానాన్ని ఎందుకు పెట్టింది అంటే.విదేశీయులు రెసిడెన్సీ లా చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారన్న కారణంతో “ప్రొటెక్టింగ్ యువర్ సెల్ఫ్ వయా రెక్టిఫైయింగ్ యువర్ స్టేటస్” అనే పథకాన్ని ప్రవేశపెట్టారు.ఇందులో భాగంగానే వీసా గడువు ముగిసిన విదేశీయులకు మూడు నెలలు సమయాన్ని ఇచ్చారు…ఈ విధానం ద్వారా ఎటువంటి శిక్షలు అనుభవించకుండా వారు తమ తమ పనులని ముగించుకుని వెళ్లిపోవచ్చు లేదంటే వీసా పోదిగించుకుని ఉండచ్చు ఆ దేశం విధించే శిక్షల నుంచీ మాత్రం తప్పించుకుంటారు.అయితే
అయితే యూఏఈ ఈ రకమైన అవకాశాలు ఇవ్వడం ఇదేమి కొత్త కాదు.2007 ల 3,41,958 మంది విదేశీయులకు క్షమాభిక్ష పెట్టారు.ఇందులో 95,259 మంది అక్కడే స్థిరపడ్డారు.60,000 మంది విదేశీయులు యూఏఈలో అక్రమంగా నివసిస్తున్నారన్న కారణంతో 2013లో ఇదే విధంగా 60 రోజుల పాటు క్షమాభిక్ష విధానాన్ని అమలు చేశారు.దీంతోపాటు 2003, 1996 లోనూ క్షమాశిక్ష పెట్టారు…దాంతో ఎంతో మంది విదేశీయులు యూఏఈ పై ప్రశంసల వర్షం కురిపించారు.
అంతేకాదు ఎన్నో దేశాలు యూఏఈ ని అభినందించాయి.
అయితే ఒక పక్క అగ్రరాజ్యం ఎంతో మంది ఆదర్శంగా నిలవాల్సిన అమెరికా మాత్రం అక్రమ వలసదారులని నిర్భందిస్తోంటే.మరో పక్క యూఏఈ ఇలా వెసలుబాటు ఇవ్వడం ఎంతో మంచి పరిణామ అంటూ ఎన్నో దేశాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.