విరాట్ కోహ్లీ జెర్సీ వేలం.. ధర ఎంతో తెలుసా..?

టీమ్ ఇండియా స్టార్ ఆటగాడు.టీమ్ ఇండియా మాజీ కెప్టెన్.

 Virat Kohli Jersey Auction Do You Know The Price , Virat Kohli , Auction , K-TeluguStop.com

మనం ముద్దుగా ‘కింగ్ కోహ్లీ’ అని పిలుచుకునే విరాట్‌ కోహ్లికి అభిమానుల్లో ఎంత ఫాలోయింగ్‌ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.భారత క్రికెట్‌లో సచిన్‌, ధోని తర్వాత అత్యంత పాపులర్‌ అయిన వ్యక్తిగా కోహ్లి స్థానం సంపాదించాడు.

దీంతో అటు సోషల్ మీడియాలోనూ.మార్కెట్లోనూ అతని బ్రాండ్‌ వ్యాల్యూ బాగా పెరిగిపోయింది.

వివరాల్లోకి వెళ్తే ఇంగ్లీష్ క్రికెట్ విజ్డెన్ విరాట్ కోహ్లీ జెర్సీని వేలం వేయటానికి రెడీ అయ్యింది.ఇందులో జెర్సీతో పాటు కోహ్లికి సంబంధించిన కొన్ని ఇంట్రెస్టింగ్‌ ఫొటోలను కూడా ఉన్నాయి.

ఆన్‌లైన్‌ పద్ధతిలో ఈ జెర్సీని వేలం వేయనున్నారు.వేలం పూర్తి వివరాలను విజ్డెన్‌ అధికారిక వెబ్‌సైట్‌ నుంచి తెలుసుకోవచ్చు.

ఒకవేళ అభిమానులు ఎవరైనా సరే కోహ్లీ జెర్సీని దక్కించుకోవాలి అనుకుంటే మాత్రం విజ్డెన్‌ వెబ్సైట్ను ఓపెన్ చేయాల్సి ఉంటుంది.కాగా విజ్డెన్‌ మీడియా కోహ్లి జెర్సీ ప్రారంభ ధరను 2499.99 పౌండ్లుగా నిర్ణయించింది(భారత కరెన్సీలో దాదాపు రూ.2.42 లక్షలు).మరి కోహ్లి జెర్సీ ఎంతకు అమ్ముడవుతుందో వేచి చూడాలి.

Telugu Dhoni, Jersey, Kohli Jersey, Virat Kohli, Wisden-Latest News - Telugu

కాగా గత ఏడాది టీమిండియా కెప్టెన్‌గా వైదొలగిన విరాట్‌ కోహ్లీ ప్రస్తుతం ఐపీఎల్‌-2022లో బిజీగా ఉన్నాడు.ఆర్‌సీబీ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్న కోహ్లి సీజన్‌లో దారుణంగా విఫలమవుతున్నాడు.ఇప్పటివరకు 9 మ్యాచ్‌లాడి 128 పరుగులు మాత్రమే చేశాడు.ఇందులో రెండు గోల్డెన్‌ డక్‌లు ఉండడం విశేషం.అయితే వీలైనంత త్వరలోనే కింగ్ కోహ్లీ ఫామ్‌లోకి వస్తాడని, గతంలో లాగే మళ్లీ పరుగుల వరద పారిస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు.కాగా వరుసగా విఫలమవుతున్న కోహ్లిని జట్టు నుంచి కొన్ని మ్యాచ్‌లు దూరంగా ఉంచాలని అభిమానులు డిమాండ్‌ చేస్తున్నారు.

ఇక ఆర్‌సీబీ తన తర్వాతి మ్యాచ్‌ను ఏప్రిల్‌ 30న గుజరాత్‌ టైటాన్స్‌తో తలపడనుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube