Cricket wickets : వికెట్ల వెనుకల బ్యాటింగ్ చేసిన క్రికెటర్ వీడియో వైరల్..

సాధారణంగా క్రికెట్ ఆడే ప్రతి ఆటగాడు బ్యాటింగ్ చేసేటప్పుడు కచ్చితంగా వికెట్ల ముందు నిలబడే బ్యాటింగ్ చేస్తాడు.కానీ వికెట్ల ముందు మాత్రమే నిలబడి ఆడాలని క్రికెట్ ఆటలో ఎక్కడ ఖచ్చితమైన నిబంధన లేదు.

 Viral Video Of Cricketer Batting Behind Wickets , Cricket , India,wickets,south-TeluguStop.com

క్రికెట్ లో సౌత్ ఆఫ్రికా క్రికెటర్ ఎబి డివిలియర్స్ క్రిజ్ అంతా తనదే అన్నట్లు క్రికెట్లో కొత్త కొత్త షాట్లు ఆడుతూ ఉంటాడు.కానీ అలా క్రికెట్ ఆడితే చూడడానికి అంత బాగోదు.

కానీ తాజాగా ఇండియన్ క్లబ్ క్రికెట్ మ్యాచ్లో ఒక బ్యాట్స్మెన్ వికెట్ల వెనకాల నిలబడి క్రికెట్ ఆడాడు.బౌలర్‌ బౌలింగ్ చేయడానికి వచ్చినప్పుడు వికెట్ల ముందుకొచ్చి ఎక్స్‌ట్రా కవర్స్‌ మీదుగా భారీ సిక్సర్‌ కొట్టాడు.

అతను కోట్టిన సిక్స్ మ్యాచ్ కే హైలెట్ గా ఉంది.అంటే అతను బ్యాటింగ్ చేసిన పద్ధతి ఇంకా హైలైట్ గా ఉంది.కానీ ప్రత్యర్థి జట్టు తమ వికెట్ కీపర్ ను అడ్డుకున్నట్లు చేస్తే మాత్రం ఆ బ్యాటర్ ను అవుట్ గా ప్రకటించే అవకాశం ఉంది.అయితే ఇక్కడ ప్రత్యర్థి జట్టు ఎలాంటి అప్పీల్‌ చేయకపోవడంతో పరుగులు రావడంతో పాటు బ్యాటర్‌ సోషల్ మీడియా లో హైలెట్ గా మారాడు.2005లో పాకిస్తాన్ ఆస్ట్రేలియా లో పర్యటించినప్పుడు ఆస్ట్రేలియా ఏ తో పాక్ ప్రాక్టీస్ మ్యాచ్లో అక్తర్‌ నోబాల్ వేయడంతో ఎంపైర్ ఫ్రీహిట్‌ ఇచ్చాడు.ఫ్రీహిట్‌ అంటే కేవలం రనౌట్‌ తప్ప ఎలా ఔట్‌ అయినా కూడా ఔట్ కాదు.

ఈ రూల్‌ను అడ్వాంటేజ్‌ గా తీసుకున్న బ్రాడ్‌ హడిన్‌, అక్తర్‌ 155 కిమీ వేగంతో వేసిన బాల్ ఆడేందుకు వికెట్ల వెనకాలకు వెళ్లి బ్యాటింగ్‌ చేసి, మిడ్‌ వికెట్‌ మీదుగా షాట్‌ ఆడి రెండు పరుగులు చేశాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube