చిన్న పిల్లలు ఒక్క చోట కుదురుగా ఉండరు.ఇంట్లో వారిని పట్టుకోవడం, వారి అల్లరిని అదుపు చేయడం కొన్నిసార్లు కష్టంగా అనిపిస్తుంది.
అయితే వారిని ఆటలు, కొన్ని పనుల్లో భాగం చేస్తే శారీరకంగా, మానసికంగా చురుకుగా ఎదుగుతారు.వేళకు చక్కగా నిద్రపోతారు.
చిన్నపిల్లలు తడబడుతూ నడిచినా, అటూ ఇటూ కదిలినా డ్యాన్స్ చేసినట్టే ఉంటుంది.ఎగ్జయిటింగ్ లేదా బాగా పాపులర్ పాట వినిపిస్తే వాళ్లు తమకు వచ్చిన స్టెప్పులు వేస్తారు.
చిన్నపిల్లలు వచ్చీరాని మాటలతో మాట్లాడే పిల్లలను చూస్తే మనసుకు ఎంతో హాయి అనిపిస్తుంది.పిల్లల చిలిపి పనులు చూస్తే ముచ్చటగా అనిపిస్తుంది.
తాజాగా ఓ బుడ్డోడి వీడియో వైరల్ అవుతోంది.కరోనా కారణంగా బయటకు వెళ్లి కటింగ్ చేయించుకునే పరిస్థితి ఎవరికీ లేదు.ఇంట్లోనే చేయించుకోవాల్సి వస్తోంది.ఇక చిన్న పిల్లలను బయటకు తీసుకెళ్ళి జుట్టు కత్తిరించుకునేలా చేయడం అసలు కుదరదు.
అందుకే ఓ బుడ్డోడికి ఇంట్లోనే ఆ పని చేయిస్తున్నారు.కటింగ్ చేయిస్తున్న ఆ టైంలో పిల్లోడు మాటలు తెగ నవ్వును తెప్పిస్తున్నాయి.
వీడియోలో అందమైన పిల్లవాడు ఎరుపు రంగు కుర్చీపై కూర్చున్న హెయిర్కట్ చేయించుకోవడం కనిపించింది.
అనుష్రుత్ అనే ఈ బుడ్డోడు తన బార్బర్ తో సంభాషిస్తున్నాడు.
విమానం మామ అతనిని పట్టుకోవడంతో జుట్టు కత్తిరించేటప్పుడు నిశ్శబ్దంగా ఉండమని కోరడంతో వీడియో ప్రారంభమవుతుంది.తరువాత, అనుశ్రుత్ హెయిర్ కట్ పొందేటప్పుడు ఎబిసిడిని చెప్పడం ప్రారంభించాడు.తన ఎబిసిడి ప్రాసను పూర్తి చేసిన తర్వాత అక్కడ ఉన్నవారు చప్పట్లు కొట్టి ప్రశంసిస్తారు.దీంతో అక్కడున్నవారు అతడ్ని మెచ్చుకోవడంతో పిల్లోడు ఆనందిస్తున్నాడు.
ఈ బుడ్డోడు చేసిన పనికి చాలా మంది అతన్ని మెచ్చుకుంటున్నారు.కరోనా టైంలో ఆ వార్తలు ఈ వార్తలు వింటూ బుర్ర హీటెక్కుతోంది.
ఇటువంటి తరుణంలో ఇటువంటి వీడియోలు చూడటం ద్వారా మనసుకు ఉల్లాసమే కాకుండా కాస్తంత ఓదార్పు కూడా లభించినట్లు ఉంటుంది.ప్రస్తుతం పిల్లోడు వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.