Viral Video : వైరల్ వీడియో: నడిరోడ్డుపై బంతితో తెగ ఎంజాయ్ చేస్తున్న ఏనుగు..!

సోషల్ మీడియాలో ప్రతిరోజు అనేక రకాల వీడియోలు వైరల్ గా మారడం మనం చూస్తూనే ఉంటాం.ఇందులో కొన్నిసార్లు జంతువులకు సంబంధించిన అనేక వీడియోలు ఎక్కువగా వైరల్ అవుతుంటాయి.

 Viral Video Elephant Enjoying The Ball On The Sidewalk-TeluguStop.com

తాజాగా ఓ ఏనుగు( elephant ) సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ చెక్కర్లు కొడుతుంది.నిజానికి ఏనుగులు ఆకారంలో పెద్దవిగా ఉన్న అవి చేసే చేష్టలు మాత్రం చూస్తే కొన్నిసార్లు మనం నవ్వకుండా ఉండలేం.

నిజానికి ఏనుగులు కాస్త భోజన ప్రియులు అని చెప్పవచ్చు.వీటికి పండ్లు అంటే అమితమైన ఇష్టం.

ఎక్కడైనా సరే ఏనుగులను పెంచుకుంటున్న వారి దగ్గరికి వెళ్ళినప్పుడు వాటికి పండ్లను ఇవ్వడం ద్వారా అవి చాలా సంతోషిస్తాయి.

అయితే కొన్నిసార్లు మాత్రం అడవి ప్రాంతంలో పరిస్థితి వేరేలా ఉంటుంది.వాటికి ఎలాంటి కీడు కలగచేయకపోయినా కొన్నిసార్లు ఏనుగులు మనుషులపై దాడి చేయడం మనం గమనిస్తూనే ఉంటాం.ఇకపోతే తాజాగా ఓ ఏనుగు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.

ఈ వీడియో లో ఓ ఏనుగు ఒక్కసారిగా కొందరు యువకులు బాస్కెట్ ఆడుతున్న ప్రదేశానికి వచ్చింది.ఈ సంఘటన గౌహతి నారంగి( Guwahati narangi ) సమీపంలో ఉన్న స్టగవ్ ఆర్మీ క్యాంపులో చోటు చేసుకుంది.

కొందరు యువకులు బాస్కెట్ బాల్ ఆడుతున్న సమయంలో బాలు వెళ్లే రోడ్డుపై పడిన సమయంలో ఏనుగు వచ్చి తన తొండంతో బాల్ ని పట్టుకుంది.దాంతో ఆ యువకులు ఏనుగుని బాల్ తమకు ఇవ్వాలని గట్టిగా అరిచికేకలు వేశారు.

అయితే యువకులు ఏం చెప్పినా ఏనుగు మాత్రం అదేం తనకు పట్టనట్లుగా వ్యవహరించి వారి బంతిని పట్టుకుని వెళ్లిపోయింది.అయితే ఇక్కడ విశేషమేమిటంటే.ఆ ఏనుగు ఆ వ్యక్తులపై ఎలాంటి దాడి చేయకుండా ఆ బాల్ తో ఆడుకుంటూ అక్కడ నుంచి వెళ్లిపోయింది.ఈ సంఘటన జరిగిన సమయంలో అక్కడ యువకులు ఆ సన్నివేశాలని మొత్తం వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వీడియో వైరల్ గా మారింది.

ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వైరల్ వీడియోని ఓసారి వీక్షించండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube