వైరల్ వీడియో: ఫుడ్ బాల్ మైదానంలోకి హఠాత్తుగా వచ్చిన పిల్లోడు.. ఆ తరువాత..?

సోషల్ మీడియా వేదికగా మనం చాలా రకాల వీడియోలను, ఫోటోలను చూసే అవకాశం కలుగుతుంది.అలాగే నెటిజన్లు కూడా ఆ వీడియోలను బాగా ఇష్టపడి వైరల్ చేస్తున్నారు.

 Viral Video: A Child Who Suddenly Enters The Football Field .. After That A You-TeluguStop.com

ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక వీడియో బాగా వైరల్ గా మారింది.స్టేడియంలో ఆటలు ఆడేటప్పుడు వాళ్ళ ఆటను చూడటానికి ఎంతో మంది వీక్షకులు స్టేడియం చుట్టూ కూర్చుని ఆటగాళ్లకు ప్రోత్సాహం ఇస్తూ ఉంటారు కదా.అయితే అలాంటప్పుడు ఒక చిన్నపిల్లాడు స్టేడియంలో కూర్చుకొండా ప్లే గ్రౌండ్ లోకి వెళిపోతే అప్పుడు చూసే వాళ్ళ రియాక్షన్ ఏంటో ఒకసారి ఊహించుకోండి.ఇప్పుడు నెట్టింట్లో ట్రెండ్ అవుతున్న వీడియో కూడా అలాంటిదే అని చెప్పాలి.

ఈ వీడియోను మేజర్ లీగ్ సాకర్ అనే వ్యక్తి తన ట్విట్టర్ లో పోస్ట్ చేసారు.

అలాగే వీడియోతో పాటు ఆ పిల్లాడిని పట్టుకుని బయటకు వస్తున్న వాళ్ళ అమ్మ ఫోటోను కూడా ట్విట్టర్ లో షేర్ చేసారు.

వీడియో తో పాటు ఆ ఫోటో కూడా నెటిజన్లకు బాగా కనెక్ట్ అయింది.అలాగే ఆ వీడియో కింద ఒక బుడ్డోడు తన చుట్టూ ఉన్న సెక్యూరిటీని తప్పించుకుని మరి మైదానంలోకి వచ్చేసాడని కామెంట్ కూడా చేసారు.అసలు వివరాలలోకి వెళితే.

అమెరికాలోని ఒహియోకు చెందిన ఓ రెండు సంవత్సరాల జైడెక్ కార్పెంటర్ అనే బుడతడు అతనితల్లి మోర్గాన్ టక్కర్‌ తో కలిసి ఆట చూసేందుకు మైదానానికి వచ్చారు.ఈ ఫుడ్ బాల్ మ్యాచ్ ఇరు వర్గాలు అయిన ఎఫ్‌సీ సిన్సినాటి వర్సెస్ ఓర్లాండ్ లో సిటీ ఎసీ మధ్య బికరంగా జరుగుతోంది.,/br>

ఆట సెకండ్ స్టేజ్ లో మంచి నువ్వా నేనా.అన్నట్టు ఇరు వర్గాలు ఆడుతున్న క్రమంలో అందరి దృష్టి మ్యాచ్‌ పైనే ఉంది.ఈ క్రమంలో ఆ బుడ్డోడి తల్లి కూడా తన కొడుకుని ఆదమరిచి మ్యాచ్ చూడడంలో ఉంది పోయింది.

ఆహా దోరికింది ఛాన్స్ అనుకున్నాడో ఏమో ఆ బుడ్డోడు వాళ్ళ అమ్మ దగ్గర నుండి తప్పించుకుని మైదానం గేటు దాటేసి లోపలి మైదానంలోకి పరుగెత్తుకుని వెళ్ళిపోయాడు.ఆ పిల్లాడిని చూసిన వాళ్ళ అమ్మ వెంటనే పిల్లాడి వెనుక మైదానంలోకి పరుగెత్తి ఆ బుడ్డోడిని పట్టుకుని క్రమంలో కాలు జారీ బొక్క బోర్లా పడిపోయింది.

మళ్ళీ వెంటనే పైకి లేచి పిల్లాడిని ఎత్తుకుని మైదానం బయటకు పరుగెత్తుకుంటూ వచ్చేసింది.ప్రస్తుతం ఇందుకు సంబందించిన ఈ వీడియో నెటిజన్లను బాగా ఆకర్షిస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube