వైర‌ల్ వీడియోః ఏకంగా పులినే త‌రిమి కొట్టిన ఎలుగుబంటి..

భూమి మీద ఉన్న అన్ని జంతువులలో కెల్లా పులి అధిక బలవంతమైన జంతువుగా చెబుతుంటారు.పులి ముందు అన్ని జంతువులు తల వంచాల్సిందే.

 Viral Video: A Bear Beaten By A Tiger Bear, Tiger, Viral Video , Viral In Inter-TeluguStop.com

అంతలా పులి అన్ని జంతువులపై ఆధిపత్యం చలాయిస్తుంటుంది.కానీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియోలో మాత్రం ఎలుగుబంటి పులిని హడలెత్తిస్తున్నట్లు ఉంది.

అసలు ఏంటీ వీడియో అని పరిశీలిస్తే చూసిన మనకు తప్పకుండా ఆశ్చర్యం కలుగుతుంది.పులేంటి ఎలుగుబంటిని చూసి పారిపోవడమేంటని చూసిన వారందరూ ముక్కున వేలేసుకుంటారు.

ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట రచ్చ రచ్చ చేస్తుంది.

కొలనులోకి వచ్చి నీరు తాగి పులి అక్కడి నుంచి తాను నడుచుకుంటూ వెళ్తుంది.

ఇలా తన మానాన తాను నిశబ్ధంగా నడుచుకుంటూ వెళ్తుండగా ఇంతలో ఆ పులికి ఓ ఎలుగుబంటి తారస పడుతుంది.ఎలుగుబంటిని చూసిన పులి భయంతో హడలెత్తిపోయి అక్కడి నుంచి పారిపోతుంది.

ఇలా పులి పారిపోవడం చూసిన ఎలుగుబంటి పులిని తరుముతుంది.ఈ మొత్తం ఘటనను ఓ వ్యక్తి షూట్ చేసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశాడు.

ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

లైకులు కామెంట్లతో నెటిజన్లు హోరెత్తిస్తున్నారు.కాగా ఈ వీడియోను బాలీవుడ్ నటుడు రణ్ దీప్ హుడా కూడా షేర్ చేయడంతో ఇక ఈ వీడియో చూసే వారి సంఖ్య అమాంతం పెరిగిపోయింది.అసలు ఎలుగుబంటిని చూసి పులి భయపడడం ఏంటని, పులే అడవికి రారాజు కదా అని చూసిన వారందరూ ఆశ్చర్యపోతున్నారు.

చూసిన ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతూ తమకు తోచిన రీతిలో కామెంట్లు చేస్తున్నారు.ఎప్పుడు ఎవరినీ తక్కువ అంచనా వేయొద్దని… ఎవరిలో ఎంత శక్తి దాగుందో చెప్పలేమని కామెంట్లు చేస్తున్నారు.

ఎంతైనా ఎలుగుబంటి ధైర్యాన్ని మెచ్చుకోవ‌చ్చు క‌దా.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube