వైరల్: ఏడుస్తున్న వ్యక్తిని ఓదార్చుతున్న చింపాంజీ.. నెటిజన్లు ఫిదా!

స్మార్ట్ ఫోన్ నేడు ప్రతిఒక్కరి చేతిలో ఉండటం వలన సోషల్ మీడియా అనేది ప్రతి ఒక్కరికీ చేరువైంది.చేతిలో సెల్ ఫోన్, అందులో డేటా ఉంటే చాలు.

 Viral: Chimpanzee Comforting A Crying Person Netizens Are Furious , Chimpanzee,-TeluguStop.com

మన కుర్రాళ్ళు గంటలకు గంటలు సమయమే తెలియకుండా అందులో మునిగిపోతున్నారు.ఇక ప్రతి రోజూ సోషల్ మీడియాలో నిత్యం ఎన్నో రకాల వీడియోలు అప్ లోడ్ అవుతుంటాయి.

వాటిలో ముఖ్యంగా జంతువులకు సంబంధించిన వీడియోలు నెటిజన్లను ఎక్కువగా ఆకట్టుకుంటున్నాయి.వీటిలో ముందు వరసలో చింపాంజీలకు సంబంధించిన వీడియోలు ఉంటాయి.

ఎందుకంటే చింపాంజీలకు, మనుషులకు చాలా అవినాభావ సంబంధం ఉంటుంది.వాటి జన్యువులు, మనుషుల జన్యువులు ఒకే రకంగా ఉంటాయని చాలా పరిశోధనల్లోనూ తేలింది కూడా.

ఈ క్రమంలో అవి చేసే ఏ పని అయినా వైరల్ అవుతుంటాయి.ప్రస్తుతం సోషల్ మీడియాలో అలాంటి వీడియో ఒకటి తెగ చక్కర్లు కొడుతోంది.బాధలో ఉన్న సమయంలో ఎవరైనా ఓదార్చడమో లేక మన బాధను ఎవరికైనా చెప్పుకోవాలని అనిపించడం సహజం.ఈ వీడియోలో ఒక వ్యక్తి విచారంగా ఉన్నప్పుడు అతని వద్ద అతని వద్దకు ఒక చింపాంజీ వచ్చి, ఆ వ్యక్తిని ఓదారుస్తుంది.

వినడానికి విడ్డురంగా వుంది కదూ.కానీ ఇక్కడ వీడియో చూస్తే మీకే అర్ధం అవుతుంది.అతను అలవాటుగానే సదరు చింపాంజీని చూసి ఏడ్చినట్టు నటించగా, అది గమనించిన చింపాంజీ మొదటగా అతని వద్దకు వచ్చి, అతని భుజం తడుతుంది.ఆతరువాత తాను ఏడుపు ఆపలేదని గమనించిన చింపాంజీ కిందకు వచ్చి, అతన్ని కౌగిలించుకుంటుంది.

సోషల్ మీడియోల వైరల్ అవుతున్న ఈ వీడియో.ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ అయింది.

ఈ వీడియోకు ఇప్పటి వరకు రెండు మిలియన్ల కంటే ఎక్కువ వ్యూస్ వచ్చాయి.అంతే కాకుండా వేల సంఖ్యలో లైక్స్ వస్తున్నాయి.

మనుషుల్లో మానవత్వం లేకున్నా జంతువుల్లో మానవత్వం ఇంకా మిగిలే ఉందని, చింపాంజీలు చాలా తెలివైనవని కామెంట్లు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube