కమల్ ఫుల్‌ హ్యాపీ.. డైరెక్టర్ కు కోటి కారు

యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ దాదాపు పుష్కర కాలం తర్వాత ఒక భారీ బ్లాక్ బస్టర్ కమర్షియల్‌ హిట్ ను దక్కించుకున్నాడు.కేవలం మూడు రోజుల్లోనే వంద కోట్ల కు పైగా వసూళ్ల ను విక్రమ్‌ సినిమా తో కమల్‌ హాసన్‌ దక్కించుకున్నాడు.

 Vikram Hero Kamal Haasan Gifted To Lokesh Kanagaraj A Car , Film News , Kamal-TeluguStop.com

చాలా ఏళ్లుగా కమల్‌ హాసన్ సినిమా లు కమర్షియల్‌ గా నిరాశ పర్చుతున్నాయి.కాని కమల్‌ హాసన్ విక్రమ్‌ సినిమా తో లాభాల పంట పండించుకున్నాడు.

దాదాపుగా అయిదు పదుల కోట్ల లాభాలు విక్రమ్‌ తో కమల్‌ హాసన్‌ కు వస్తాయని ఇప్పటికే ఒక అంచనా.ఆ అంచనా ను మించి వసూళ్లు నమోదు అవుతున్నట్లుగా ట్రేడ్‌ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

అక్కడ ఇక్కడ అని కాకుండా అన్ని చోట్ల కూడా భారీ గా విక్రమ్‌ లాభాలు తెచ్చి పెడుతున్న నేపథ్యం లో కమల్‌ చాలా హ్యాపీ గా ఉన్నాడు.

అందుకే ఆ హ్యాపీ తో దర్శకుడు లోకేష్ కనగరాజ్ కు ఖరీదైన కారును బహుమానం గా ఇచ్చాడు.

దాదాపుగా కోటి విలువ చేసే ఆ కారు బిగ్‌ కీ ని లోకేష్ కనగరాజ్ కు అందజేసిన కమల్‌ హాసన్ ఈ సందర్బంగా దర్శకుడి కి కృతజ్ఞతలు తెలియజేశాడు.తనకు ఇన్నాళ్ల తర్వాత ఒక కమర్షియల్‌ హిట్ ఇచ్చినందుకు లోకేష్‌ కనగరాజ్ కు అంతకు మించి ఇచ్చినా కూడా పర్వాలేదు.

కమల్‌ హాసన్‌ కోటి గిఫ్ట్‌ తో దర్శకుడు లోకేష్ కనగరాజ్ ఫుల్‌ హ్యాపీగా ఉన్నాడు.మొదటి నుండే కమల్‌ అంటే విపరీతమైన అభిమానం ఉన్న లోకేష్ కనగరాజ్ ఆయన తో సినిమా చేసే అవకాశం రాగానే అద్బుతాన్ని ఆవిష్కరించాలి అనుకున్నాడు.

అనుకున్నట్లుగానే విక్రమ్‌ ను అద్బుతం గా ఆవిష్కరించి అందరి దృష్టిని ఆకర్షించి సక్సెస్‌ అయ్యాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube