నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘బీస్ట్’. ఈ సినిమాలో తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి హీరోగా నటించాడు.
ఈయన సరసన టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది.ఇక ఈ సినిమా ఈరోజు థియేటర్ లలో పలు భాషలలో ప్రపంచవ్యాప్తంగా విడుదల కాగా ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటుందో చూద్దాం.
కథ:
ఈ సినిమాలో విజయ్ రాఘవన్ అనే ఓ పాత్రలో నటించాడు.ఇక ఈయన చేపట్టిన ఒక సీక్రెట్ ఆపరేషన్ లో చిన్న తప్పు జరగడం వలన ఓ చిన్నారి మరణిస్తుంది.
ఇక అది చూసిన రాఘవన్ షాక్ అయ్యి డిప్రెషన్ లోకి వెళ్లి పోతాడు.ఇక ఆ డిప్రెషన్ నుంచి బయటపడటానికి ట్రీట్మెంట్ తీసుకుంటాడు.ఆ సమయంలోనే తనకు ప్రీతి (పూజా హెగ్డే) పరిచయం అవుతుంది.ఇక ప్రీతి తక్కువ సమయంలోనే రాఘవన్ ప్రేమలో పడుతుంది.
ఇక ఆయనకు ప్రపోజ్ చేస్తుంది.ఇక అనుకోకుండా టెర్రరిస్టులు టార్గెట్ చేసిన ఓ మాల్ కు వీర రాఘవన్ ఆయన టీం వస్తారు.ఇక ఆ సమయంలో ఆయన వారిని ఎలా అడ్డుకుంటారు అనేది మిగిలిన కథలోనిది.
నటినటుల నటన:
నటీనటుల విషయానికి వస్తే.విజయ్ తన పాత్రతో మరోసారి ప్రేక్షకులను మెప్పించాడు.కానీ అభిమానులు కోరుకున్న విధంగా డైరెక్టర్ విజయ్ ను చూపించలేక పోయాడు.ఇక పూజ హెగ్డే పాత్ర కూడా చాలా తక్కువగా అనిపించింది.కానీ తన నటనతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.
విటివి గణేష్ తన పంచులతో బాగా ఆకట్టుకున్నాడు.యోగి బాబు మాత్రం తన కామెడీతో అంతగా ఆకట్టుకోలేకపోయాడు.

టెక్నికల్:
టెక్నికల్ పరంగా దర్శకుడు నెల్సన్ ఈ సినిమాతో అంతగా మెప్పించలేకపోయాడు.పైగా అనవసరమైన యాక్షన్ సన్నివేశాలు బాగా చూపించాడు.మనోజ్ పరమహంస అందించిన సినిమాటోగ్రఫీ, అనిరుధ్ అందించిన సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది.కొన్ని సన్నివేశాలు థ్రిల్లింగ్ గా ఆకట్టుకున్నాయి.ఇక నిర్మాణ సంస్థ కూడా బడ్జెట్ విషయంలో ఎక్కడా తగ్గలేదు అన్నట్టు అనిపించింది.

విశ్లేషణ:
ఇక ఈ సినిమాలో స్టార్ హీరో విజయ్ నటించడంతో ప్రేక్షకుల్లో మరింత కుతూహలం పెరిగింది.పైగా ప్రేక్షకులు ఈ సినిమాలో చాలా ఎక్స్పెక్ట్ చేశారు.కానీ ఈ సినిమాలో ఎటువంటి కంటెంట్ లేకపోవటంతో ప్రేక్షకులను నిరాశ పరిచింది.
అంతేకాకుండా పొలిటికల్ ప్రాపగాండా ఎక్కువ కావడంతో సినిమా అంతగా మెప్పించలేకపోయింది.కొన్ని కొన్ని పాత్రలు కూడా అంతగా ఆకట్టుకోలేకపోయాయి.

ప్లస్ పాయింట్స్:
విజయ్ నటన, కామెడీ, యాక్షన్ సన్నివేశాలు.
మైనస్ పాయింట్స్:
సెకండాఫ్, క్లైమాక్స్, కథ
బాటమ్ లైన్:
ఈ సినిమా కేవలం విజయ్ అభిమానులు మాత్రమే చూసి ఎంజాయ్ చేయగలరు కానీ మిగతా ప్రేక్షకులకు అంతగా ఆకట్టుకోదు అన్నట్టు అనిపిస్తుంది.యాక్షన్ పరంగా, కామెడీ పరంగా కొంత వరకు పరవాలేదు అనిపించినా కథ మాత్రం బోరింగ్ అన్నట్లు ఉంది.