కోలీవుడ్ సూపర్ స్టార్ విజయ్ దళపతి సినిమా వస్తుంది అంటే తమిళ్ లో ఏ రేంజ్ లో హడావిడి ఉంటుందో చెప్పాల్సిన పని లేదు.ఈయనకు అక్కడ భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.
ఇక ఇప్పుడు తెలుగులో కూడా మార్కెట్ సాధించాలి అని గట్టి పట్టుదలతో ఉన్నాడు.ప్రెజెంట్ విజయ్ దళపతి వారసుడు సినిమా చేస్తున్నాడు.
టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో విజయ్ తన 66వ సినిమాను చేస్తున్నాడు.తమిళ్ లో ‘వరిసు‘ అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ క్రేజీ సినిమాపై ఇప్పటికే అంచనాలు పీక్స్ కు చేరుకున్నాయి.
దిల్ రాజు భారీ స్థాయిలో పాన్ ఇండియా సినిమాగా నిర్మిస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది.
అయితే తాజాగా ఈ సినిమా ఫస్ట్ సింగిల్ అప్డేట్ ఇచ్చారు.
ఎప్పటి నుండో ఈ సినిమా ఫస్ట్ సింగిల్ గురించి ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.దీపావళికే ఈ సినిమా ఫస్ట్ సింగిల్ వస్తుంది అని ఫ్యాన్స్ ఎదురు చూసారు.
కానీ అప్పుడు ఈ అప్డేట్ రాకపోవడంతో ఫ్యాన్స్ నిరాశ చెందారు.అయితే తాజాగా ఫ్యాన్స్ ఖుషీ అయ్యే కబురు అందించారు.

ఈ సినిమా ఫస్ట్ సింగిల్ టైం, డేట్ ఫిక్స్ చేసినట్టు తాజాగా ఒక పోస్టర్ రిలీజ్ చేసారు.ఈ రోజు సాయంత్రం 6 గంటల 30 నిముషాలకి అయితే ఈ ప్రోమో రానుంది అని ఫిక్స్ చేశారు.థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా ఫస్ట్ సింగిల్ ఎలా ఉంటుందో అని ఎదురు చూస్తున్నారు.చూడాలి ఎలా ఆకట్టు కుంటాడో.