విదేశాలలో ఉన్న భారత ఎన్నారైలు ఎంతో మంది తమ తమ భంధువు ఎవరైనా అనారోగ్యం పాలయినా చనిపోయినా అత్యవసరంగా ప్రయాణం చేయాల్సి ఉంటుంది.అయితే ఈ క్రమంలో ఒక్కో సారి వీసా అనుమతి సమస్యలు ఎన్నో ఉత్పన్నం అవుతూ ఉంటాయి.
అయితే ఈ సమయంలో వారు ఇండియా కి వెళ్ళడం కోసం ఎమర్జన్సీ వీసా ఎంతగానో ఉపయోగపడుతుంది.
ఈ వీసాను ప్రతీ శని.ఆదివారాల్లోనూ.ఇతర సెలవుదినాల్లోనూ వాషింగ్టన్‌లోని ఇండియన్ ఎంబసీలో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంటలోపు తీసుకోవచ్చు.
నేషనల్ సెలవులు అయిన జనవరి 26, ఆగష్టు 15, అక్టోబర్ 2వ తారీఖున ఈ సర్వీసు లభించదు.ఈ సర్వీసును ఉపయోగించుకోవాలంటే అత్యవసరంగా ప్రయాణానికి కారణాలను ఎంబసీలో రుజువు చేసేవిధంగా పత్రాలు చూపించాలి.
దీనితోపాటు బుక్ చేసుకున్న విమాన టిక్కెట్టును ఎంబసీలో సబ్మిట్ చేయడంతో పాటు, సాధారణ వీసాకు ఇచ్చే రుసుముతో పాటు అదనంగా 100 డాలర్లను చెల్లించాలి.
అయితే వివిధ దేశాల పాస్పోర్ట్ లు కలిగి ఉన్నవారు మరియు వెళ్ళవలసిన వ్యక్తి ఏదైనా కేసులలో ఉన్నప్పుడుడు అతడిపై న్యాయ విచారణ జరుగుతున్నప్పుడు…ఈ సర్వీసును పొందేందుకు అనర్హులు.
సాధారణ వీసా మాదిరిగా ఈ దరఖాస్తులను మెయిల్ ద్వారా పంపించడం కుదరదు.అంతేకాక ఎమర్జెన్సీ వీసా ఇవ్వడంపై తుది నిర్ణయం కాన్సులర్ దే.అయితే ఈ వీసా విషయంలో పూర్తిగా అధికారుల నిర్ణయం పైనే ఆధారపడి ఉంటుంది.