తెలుగువారికి పెద్ద పండుగ అయినటువంటి సంక్రాంతి పండుగ( Sankranthi Festival ) వేడుకలు ఇప్పటికే మొదలయ్యాయి.ఈ క్రమంలోనే సెలబ్రిటీల నుంచి మొదలుకొని సాధారణ ప్రజల వరకు కూడా సంక్రాంతి సంబరాలలో మునిగిపోయారు.
ఈ క్రమంలోనే మెగా కుటుంబం ఈ ఏడాది కూడా ఘనంగా సంక్రాంతి సంబరాలు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.అయితే ఈసారి మెగా అల్లు కుటుంబ సభ్యులందరూ కలిసి బెంగళూరులోని ఫామ్ హౌస్ లో ఈ సంక్రాంతి వేడుకలను జరుపుకోబోతున్నారు.
ఇప్పటికే అక్కడ భోగి వేడుకలు ఎంతో ఘనంగా ప్రారంభం అయ్యాయని మెగా కోడలు ఉపాసన ( Upasana ) సోషల్ మీడియా వేదికగా ఫోటోలు వీడియోలను అభిమానులతో పంచుకున్నారు.

ఇక ఈ సంక్రాంతి వేడుకలు కొత్త కోడలు లావణ్య త్రిపాటి( Lavanya Tripati ) కి మొదటి పండుగ కావడంతో లావణ్య త్రిపాఠి అలాగే ఉపాసన కుమార్తె క్లిన్ కారా( Klin Kaara ) స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు.ఇక ఉపాసన షేర్ చేసినటువంటి ఫోటోలలో లావణ్య త్రిపాఠి కుటుంబ సభ్యులందరికీ కూడా సున్నుండలు తయారు చేస్తూ ఉన్నటువంటి ఫోటోని షేర్ చేశారు.ఈ ఫోటోని షేర్ చేసినటువంటి ఉపాసన కొత్త కోడలు ఇంటిల్లపాదికీ సున్నుండలు చేస్తోంది.
ఆమె ఎంతో స్వీట్ అంటూ ఉపాసన లావణ్య త్రిపాఠి వీడియో షేర్ చేయగా అందుకు లావణ్య త్రిపాఠి రిప్లై ఇస్తూ.

థ్యాంక్యూ.సూపర్ స్వీట్ పెద్ద కొడలు అంటూ రిప్లై ఇచ్చారు.మొత్తానికి మెగా కుటుంబ సభ్యులందరూ ఒకే చోట చేరి ఈ సంక్రాంతి పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటున్నారని తెలుస్తుంది.
ఇక వీరందరూ కూడా పెద్ద ఎత్తున భోగి వేడుకలను ప్రారంభించారు భోగి మంటలు వేయడమే కాకుండా ప్రతి ఒక్కరు కూడా వివిధ రకాల వంటలను తయారు చేస్తూ ఉన్నటువంటి ఫోటోలు వీడియోలను ఉపాసన సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు.చిరంజీవి బజ్జీలు వేస్తూ కనిపించగా రాంచరణ్ దోస వేస్తూ కనిపించారు.
ఇక ఇక్కడ కూడా ఉపాసన క్లీన్ కారా ఫేస్ కనపడకుండా జాగ్రత్త పడ్డారు.