ఉప్పల్ తొలి వన్డే న్యూజిలాండ్ పై భారత్ ఘన విజయం..!!

హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో న్యూజిలాండ్ తో జరిగిన తొలి వన్డేలో భారత్ ఘన విజయం సాధించింది.టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 349 పరుగులు చేయడం తెలిసిందే.

 Uppal First Odi Win For India Against New Zealand Details, Mohammed Siraj, Shubm-TeluguStop.com

ఓపెనర్ శుభమన్ గిల్ 149 బంతులలో 19 ఫోర్లు, 6సిక్సర్లతో 208 కొట్టడం జరిగింది.ఆ తర్వాత రెండో బ్యాటింగ్ దిగిన న్యూజిలాండ్ 337 పరుగులకు అలౌట్ అయింది.

మ్యాచ్ చివరి ఓవర్ వరకు కొనసాగడంతో ఉత్కంఠ పోరులో 12 పరుగుల తేడాతో ఇండియా విజయం సాధించడం జరిగింది.భారీ టార్గెట్ చేదించడానికి న్యూజిలాండ్ …సెకండ్ బ్యాటింగ్ దిగిన సమయంలో స్టార్టింగ్ లోనే 130 పరుగులకు 6 వికెట్లు కోల్పోయింది.

ఇటువంటి క్లీష్ట సమయంలో కివీస్ కీలక ఆటగాడు బ్రెస్ వెల్, శాంట్నర్ క్రీజ్ లో నిలదొక్కుకొని భారత్ బౌలర్ లను చెడుగుడు ఆడేసుకున్నారు.

దీంతో బ్రెస్ వెల్(140), శాంట్నర్(57) పరుగులు చేసి కివిస్ నీ గెలిపించేంత పనిచేశారు.ఈ క్రమంలో సిరజ్. శాంట్నర్.నీ ఔట్ చేయటం జరిగింది.తర్వాత బ్రెస్ వెల్ పోరాడీనా కానీ మిగతా బ్యాట్స్ మ్యాన్ లు క్రీజ్ లో నిలదొక్కుకోలేకపోయారు.భారత్ బౌలర్ లలో సిరజ్ 4 వికెట్లతో చెలరేగాడు.ఉత్కంఠ భరితంగా నువ్వా నేనా అన్న రీతిలో జరిగిన ఈ మ్యాచ్ లో బ్రెస్ వెల్ ఆట తీరు అందరిని ఆకట్టుకుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube