ఆ వివాదాస్పద సింగర్ ఉపాసన స్నేహితురాలా.. షాకవుతున్న మెగా ఫ్యాన్స్!

మెగా కోడలు ఉపాసనకు ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదు.ఉపాసన సినిమాలలో నటించకపోయినా చిరంజీవి కోడలు, రామ్ చరణ్ భార్య కావడంతో సినీ అభిమానులు ఆమెను ఎంతగానో అభిమానిస్తున్నారు.

 Upasana Attend Pushpa Singer Kanika Kapoor Wedding Ceremony Details, Upasana, Ka-TeluguStop.com

తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ వ్యాపారవేత్తలలో ఉపాసన ఒకరు కావడం గమనార్హం.తాజాగా ఉపాసన బెస్ట్ ఫ్రెండ్స్ జాబితాలో వివాదాస్పద సింగర్ గా పేరును సంపాదించుకున్న కనికా కపూర్ కూడా ఉన్నారని వెల్లడైంది.

ఈ విషయం తెలిసి మెగా ఫ్యాన్స్ సైతం షాకవుతున్నారు.ఉపాసనకు, కనికా కపూర్ కు స్నేహం ఎక్కడ కుదిరిందని సోషల్ మీడియాలో అభిమానుల మధ్య చర్చ జరుగుతుండటం గమనార్హం.

తాజాగా కనికా కపూర్ వివాహం లండన్ లో గ్రాండ్ గా జరగగా ఈ వేడుకకు ఉపాసన హాజరు కావడంతో నెట్టింట ఈ చర్చ జోరుగా జరుగుతుండటం గమనార్హం.కనికా కపూర్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సింగర్ అనే సంగతి తెలిసిందే.

18 సంవత్సరాల వయస్సులోనే కనికా కపూర్ కు మొదటి వివాహం జరిగింది.

అయితే వేర్వేరు కారణాల వల్ల 2012 సంవత్సరంలో కనికా కపూర్ భర్తతో విడిపోవడం జరిగింది.ఆ తర్వాత కొన్నేళ్ల పాటు ఒంటరి జీవితాన్ని గడిపిన ఈ సింగర్ తాజాగా మరో వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు.43 సంవత్సరాల వయస్సులో కనికా కపూర్ వివాహం చేసుకోవడంతో అభిమానులు సైతం ఒకింత ఆశ్చర్యానికి గురవుతున్నారు.

కనికా కపూర్ గౌతమ్ అనే వ్యక్తిని వివాహం చేసుకోవడం గమనార్హం.అయితే కనికా కపూర్ బిజినెస్ గ్రూప్ ఫ్యామిలీకి చెందిన వ్యక్తి కాగా ఉపాసన కూడా బిజినెస్ ఉమన్ కావడంతో వీళ్లిద్దరి మధ్య స్నేహం ఏర్పడి ఉండవచ్చని తెలుస్తోంది.కనికా గతంలో లండన్ నుంచి వచ్చిన తర్వాత పార్టీలో పాల్గొనగా ఆ తర్వాత ఆమెకు కరోనా సోకడంతో ఆమెపై విమర్శలు వచ్చాయి.ఆ సమయంలో కనికా కపూర్ ను నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube