పీకల్లోతు కష్టాల్లో రామ్‌ చరణ్‌ మామ?

మెగాస్టార్‌ వియ్యంకుడు, కామినేని కుటుంబ వారసుడు అయిన వ్యక్తికి కష్టాలు ఏంటని ఆశ్చర్యపోతున్నారా, అసలు విషయం ఏంటీ అంటే కామినేని కుటుంబంకు చెందిన దోమకొండ సంస్థానంకు చెందిన పలు భవనాలను నావి అంటూ చరణ్‌ మామ అదేనండి ఉపాసన తండ్రి అయిన కామినేని అనిల్‌ ఆమద్య స్వాదీనం చేసుకున్నాడు.చాలా ఏళ్లుగా మూతపడి ఉన్న సంస్థానం భవనాలను శుభ్రం చేయించి, వాటిని ఆధీనంలోకి తీసుకుని అక్కడ ప్రైవేట్‌ సెక్యూరిటీని కూడా ఏర్పాటు చేయించడం జరిగింది.

 Upasana Father Inproblems-TeluguStop.com

అయితే అదే కామినేని కుటుంబంకు చెందిన పూర్వికులు ఇప్పుడు ఆ ఆస్తుల్లో తమకు వాటా ఉందని, అనిల్‌ ఒక్కడే దోమకొండ సంస్థానం ఆస్తులను ఎలా స్వాదీనం చేసుకుంటాడు అంటూ ముందుకు వచ్చారు.

అనిల్‌ ఆధీనంలో ఉన్న దోమకొండ సంస్థానం భవనానికి తాలాలు వేయడంతో పాటు, దాన్ని కుటుంబ ఆస్తిగా పరిగణించాల్సిందే అంటూ ఇతర కుటుంబ సభ్యులు కోర్టును ఆశ్రయించారు.ఈ సమయంలోనే తన ఆధీనంలో ఉన్న దోమకొండ సంస్థానంలోకి అక్రమంగా చొరబడి తాళాలు వేశారు అని పోలీసులకు అనిల్‌ ఫిర్యాదు చేశాడు.పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు, వేసిన తాళాలను పగులకొట్టించాడు.

ఇలా ఈ విషయం రచ్చ సాగుతున్న సమయంలో అసలు ఈ దొమకొండ సంస్థానం వివాదం ఏంటా అని తెలుసుకునేందుకు ఎక్కువ శాతం మంది ఆసక్తి చూపుతున్నారు.

స్వాతంత్య్రం రాకముందు వరకు నిజామాబాద్‌ జిల్లాలో దోమకొండ సంస్థానం పేరుతో కామినేని వంశస్తులు పాలన సాగించేవారు.

బ్రిటిష్‌ వారికి కప్పం కడుతూ దోమకొండను కామినేని వంశస్తులు తమ ఆధీనంలోనే ఉంచుకున్నారు.స్వాతంత్య్రం అనంతరం దేశంలో ఉన్న సంస్థాలన్నింటిని కూడా తమ ఆధీనంలోకి కేంద్రం తీసుకుంది.

అప్పటి నుండి దోమకొండ సంస్థానంను పట్టించుకున్న నాదుడు లేడు.కామినేని వంశస్తులు అంతా కూడా వివిధ ప్రాంతాల్లో సెటిల్‌ అయ్యారు.

ఈ సమయంలో ఉపాసన, రామ్‌ చరణ్‌ పెళ్లి సందర్బంగా దోమకొండ సంస్థానం పేరు వచ్చింది.

అప్పట్లో చిరంజీవి కేంద్ర మంత్రిగా ఉండటంతో అనిల్‌ సులభంగా దోమకొండ సంస్థానంను తన ఆధీనంలోకి తీసుకున్నాడు.

అప్పటి స్థానిక ప్రభుత్వ అధికారులు మరియు కేంద్రం కూడా అనిల్‌కు మద్దతుగా నిలిచింది.చిరంజీవి మంత్రి పదవి పోవడం, అసలు కాంగ్రెస్‌ అధికారంలో లేకుండా పోవడంతో దోమకొండ చర్చ మళ్లీ మొదటికి వచ్చింది.

కుటుంబ ఆస్తిని అనిల్‌ ఒక్కడే ఎలా అనుభవిస్తాడు అంటూ అదే ఫ్యామిలీకి చెందిన వారు కోర్టుకు వెళ్లారు.దాంతో ఇప్పుడు అనిల్‌కు కష్టాలు తప్పడం లేదు.కోర్టులో సరైన తీర్పు వస్తే మాత్రం దోమకొండ అనిల్‌ నుండి దూరం అవ్వడం ఖాయం అంటూ కొందరు అంటున్నారు.మొత్తానికి చరణ్‌ మామ ఎంతో ఏరి కోరి బాగు చేయించుకున్న దోమకొండ సంస్థానం మళ్లీ బూజు పట్టే పరిస్థితి రాబోతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube