పసి పాప అయినా, చిన్న అమ్మాయి అయినా, పడుచు అమ్మాయి అయినా, మహిళ అయినా, వృద్దురాలు అయినా కాళ్లకు పట్టిలు ఉంటే లక్షణంగా అనిపిస్తారు.ముఖ్యంగా చిన్న పిల్లలకు గల్లు గల్లు మంటూ పట్టీలు ఉంటే ఆ ఇంట్లో ఆనందం అలరాలుతుందని చెప్పుకోవడంలో ఎలాంటి సందేహం లేదు.
సౌండ్ వచ్చే పట్టీలతో పిల్లలు ఇంట్లో తిరుగుతుంటే లక్ష్మిదేవి తిరుగుతున్నట్లుగా అనిపిస్తుందని పెద్దలు అంటూ ఉంటారు.పిల్లలు మాత్రమే కాకుండా పెద్దలు కూడా పట్టీలు పెట్టుకుంటే అందంగా కనిపించడంతో పాటు ఆరోగ్యం కూడా అంటున్నారు.

పట్టీలు అనగానే వెండి పట్టీలు గుర్తుకు వస్తాయి.కాని ఈమద్య బడాయికి పోయి పంచ లోహాలతో తయారు చేసిన పట్టీలు, మరి కొందరు ప్రిస్టేజ్‌కు పోయి బంగారు పట్టిలను కూడా వాడుతూ ఉన్నారు.ఇక కొందరు సన్నగా చైన్ మాదిరిగా వాడుతుంటే మరి కొందరు మాత్రం కనిపించి కనిపించని విధంగా పట్టిలను ధరిస్తూ ఉన్నారు.పట్టీలు అనేవి వెండితో తయారు చేయించి, ఒక మాదిరి సైజ్‌తో ఉన్నవి ధరిస్తేనే బాగుంటుందని పెద్దలు అంటున్నారు.
ఫ్యాషన్‌కు పోయి కొందరు అమ్మాయిలు పట్టీలనే పెట్టుకోవడం లేదని, పెట్టుకున్న బంగారం పట్టీలంటూ పెట్టుకుంటున్నారు.బంగారం పెట్టుకోవడం ఎంత మాత్రం మంచిది కాదని పెద్దలు చెప్పడంతో పాటు, సైన్స్ కూడా చెబుతోంది.
పెద్దలు చెప్పే దాని ప్రకారం బంగారం అనేది లక్ష్మీ దేవితో సమానం.బంగారం పసుపు వర్ణంలో ఉంటుంది.
పసుపు అంటే కూడా లక్ష్మి దేవినే.అలాంటి లక్ష్మి దేవిని కాళ్లకు ధరించడం ఏమాత్రం కరెక్ట్ కాదు.
బంగారం అనేది మెడలో లేదా తలపై ఉండాలి.బాగా ఉంది కదా అని బంగారంను పట్టీలు మాదిరిగా పెట్టుకుంటే అంతే.
ఇక బంగారం పట్టీలు పెట్టుకుంటే నష్టం అని సైన్స్ కూడా చెబుతోంది.వెండి పట్టీలు పెట్టుకుంటే మనిషి శరీరంలోని వేడిని లాగేస్తుంది.
అదే బంగారం మనిషిలోని వేడిని పెంచుతుంది.

అలా పెంచడం వల్ల పలు అనారోగ్య సమస్యలు వస్తాయి.కాళ్లకు వెండి పట్టీలు పెట్టుకోవడం వల్ల వేడి తగ్గడంతో పాటు కాళ్ల నొప్పి, నడుము నొప్పి, హిస్టీరియా వంటి సమస్యలు రావని నిపుణులు చెబుతున్నారు.అందుకే డబ్బులు ఉంటే దాచుకోవాలి కాని, ఇలా కాళ్లకు బంగారు పట్టీలు పెట్టుకోవడం మాత్రం కరెక్ట్ కాదు.