విఠలాచార్య సినిమాల ద్వారా తెలుగు తెరకు పరిచయమైన నటుడు నరసింహారాజు.1970లో అనేక విజయవంతమైన జానపద సినిమాలో హీరోగా నటించి ఆంధ్ర కమల్ హాసన్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు.నరసింహారాజు నటించిన జగన్మోహిని అనే సినిమా ఎంతో మంచి ఘనవిజయాన్ని సాధించింది.ఆ సినిమా తర్వాత ఏకంగా 110 సినిమాల్లో హీరోగా నటించిన నరసింహ రాజు ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, తండ్రి పాత్రల్లో ఎక్కువగా కనిపిస్తున్నాడు.
వెండి తెర పైన అవకాశాలు తగ్గిన సమయంలో బుల్లితెరపై కూడా నటించాడు.
పశ్చిమగోదావరి జిల్లా, ఉండ్రాజవరం లో మట్లూరు అనే గ్రామంలో 1951 డిసెంబర్ 26న నరసింహరావు రాజు జన్మించారు.
పీయిసి చదువుకునే రోజుల్లోనే సినిమాపై ఆసక్తి కలగడంతో మద్రాస్ కు వెళ్ళిపోయారు.అప్పట్లో నరసింహారాజు తండ్రి ఎంతో దానగుణం కలిగి ఉండి అనేక ఆస్తులను దానం పేరుతో పోగొట్టుకున్నాడు.
అలా చెన్నైకి వెళ్ళిన నరసింహారాజుకి విఠలాచార్య పరిచయంతో తన జీవితం మరోవైపు మలుపు తిరిగింది.
ఇక నరసింహ రాజు వ్యక్తిగత జీవితం విషయాల్లోకి వస్తే ఆయనకి ఒక కుమారుడు ఒక కుమార్తె ఉన్నారు.

కుమార్తె మెహది పట్నంలో అనేక కళాశాలలకు హెచ్ఆర్ గా పనిచేస్తుండగా, కుమారుడు మాత్రం కెనడాలో సెటిల్ అయ్యాడు.తండ్రి హీరోగా సంపాదించింది ఏమీ లేకపోవడంతో కొడుకు అయిన గట్టిగా సినిమాల్లో నటించాలని కోరుకున్నప్పటికీ నరసింహరాజు అందుకు ఒప్పుకోలేదు.దాంతో కెనడా వెళ్లి అక్కడ ప్రొఫెసర్ గా జాయిన్ అయి బాగా స్థిరపడ్డాడు నరసింహ రాజు కొడుకు.నరసింహ రాజుకి కెనడాలో 10 ఎకరాల గార్డెన్ తో పాటు రెండు ప్యాలెస్ లు కూడా ఉండడం విశేషం.
ప్రతి వేసవి కాలంలో భార్యతో కలిసి నరసింహారాజు తన కొడుకు దగ్గరికి వెళ్లి బాగా ఎంజాయ్ చేసి వస్తారట.