కేటీఆర్ ని ఎదురుకోలేకనే అక్రమ కేసులు భారాసవివి రాష్ట్ర నాయకులు కంచర్ల రవి గౌడ్

రాజన్న సిరిసిల్ల జిల్లా: తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తున్న కేటీఆర్ పై కక్ష సాధింపు తో రేవంత్ రెడ్డి సర్కారు అక్రమ కేసులు పెట్టాలని ఏడాదిలో ఆరుసార్లు ప్రయత్నించారు అని భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం రాష్ట్ర నాయకులు కంచర్ల రవి గౌడ్ అన్నారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏడాది పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం సొంత రాజ్యాంగాన్ని అమలు పరుస్తున్నారని, ఫార్ములా ఈ కార్ రేస్ తెచ్చి హైదరాబాదును ప్రపంచ చిత్రపటం లో నిలిపిన కేటీఆర్ ను బదనం చేసేందుకు కేసుల పేరిట కుట్రలు చేస్తున్నారని అన్నారు.

 Unable To Confront Ktr, Illegal Cases Are Filed Against Bharatiya Vidyalaya Stat-TeluguStop.com

ఫార్ములా ఈ రేస్ అత్యంత ప్రతిష్టాత్మకమైనదని దీనిని హైదరాబాదులో నిర్వహించడం రాష్ట్రానికి గర్వకారణమని,ఈ రేసు నీ హైదరాబాదుకు తీసుకురావడానికి కేటీఆర్ ప్రదర్శించిన స్ఫూర్తిని అర్థం చేసుకునే పరిణితి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదన్నారు.దేశంలో అన్ని రాష్ట్రాలలో తెలంగాణను నెంబర్ వన్ గా నిలిపేందుకు కేటీఆర్ కృషి బిఆర్ఎస్ ప్రభుత్వానిదే అని అన్నారు.

పదేళ్లపాటు అద్భుతంగా సాగిన తెలంగాణ అభివృద్ధి ఏడాది కాంగ్రెస్ పాలన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే సీఎం రేవంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ మొదలుపెట్టారని పేర్కొన్నారు.రైతు భరోసా ఎగ్గొట్టి పింఛన్లకు ఎగనామం పెట్టి రుణమాఫీలో కోత పెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల దృష్టి మరల్చేందుకు ఈ కేసులు నాటకం ఆడుతున్నారన్నారు.

ఇది ముమ్మాటికి కేటీఆర్ మీద పెట్టిన కేసు తప్పుడు కేసు అని బిఆర్ఎస్ నీ,కెసిఆర్ కుటుంబాన్ని బదనాం చేయాలని చూస్తున్నారని, ఇలాంటి కక్ష సాధింపు చర్యలను తెలంగాణ ప్రజలు సమాజం ఒప్పుకోదు అని ఆయన అన్నారు.ఇలాంటి అక్రమ కేసులకు బిఆర్ఎస్ పార్టీ గాని కేటీఆర్ గానీ భయపడే ప్రసక్తే లేదని ఇలాంటి అక్రమ కేసు పెట్టీ అరెస్టు చేసిన కేటీఆర్ కడిగిన ముత్యంల బయటికి వస్తారని ఆయన అన్నారు.

ఇప్పటికైనా ముఖ్యమంత్రి మీరు ఇచ్చిన ఆరు గ్యారంటీల హామీల అమలు అయ్యేలా చూడాలని మీ వైఖరిని తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని అన్నారు.ఆరు గ్యారెంటీలు అమలయ్యే వరకు బిఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన నిత్యం పోరాడుతుందని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు మట్టే శ్రీనివాస్, ముగ్దం అనిల్ గౌడ్, కొడం వెంకటేష్,ముదాం సాయి,కోడి రోహిత్, సంపత్,తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube