మానవ హక్కులు పేరులోనే మానవుడి పేరు జొప్పించడంతో వీటికి విశేష ప్రాధాన్యత ఏర్పడింది.ఇవి అందరికి ఉపయుక్తంగా ఉన్నాయి కాబట్టి సార్వజనీనమైనవి.ఈ మానవ హక్కులు ప్రగతి శీలమైనవి కూడా.1948లో ఐక్యరాజ్య సమితి మానవ హక్కులను ప్రకటించింది.ఒక లక్ష్యంతో ఈ ప్రకటన ఐక్యరాజ్య సమితి చేసింది.విశ్వమంతా ఒకే కుటుంబం అనే భావన ప్రజలలో బాగా నాటుకుపోయేటట్లు చేసింది.ఐక్యరాజ్య సమితి చొరవతోనే ఇవి విశ్వవ్యాప్తం అయ్యాయి.ఒక గుర్తింపు వచ్చింది.
వీటికి గొప్ప ఆశయాలు ఉన్నాయి.వాటిలో ప్రధానంగా రక్షణ పొందే స్వేచ్ఛ , అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడటం ,ప్రధానమైన ఆశయాలు.
వ్యక్తులలో నిబిడీకృతమైన నైపుణ్యాలను వినియోగించుకునే స్వేచ్ఛ, ఆశయాలు బహు ఉత్తమంగా ఉన్నాయి.అయితే ఆచరణలో ఏవీ ఉండటం లేదు.
ప్రతి చోట మానవ హక్కులకు అన్యాయమే జరుగుతోంది.మా హక్కు మాకు కావాలి అని నినందించడం చూస్తూనే ఉన్నాం.
ఇటీవల ట్విట్టర్ అనే సంస్థ ఉద్యోగులను తొలగించడం దుమారం రేపింది.ఇది ఒక ట్విట్టర్ లోనే కాదు నేడు చాలా సంస్థలలో ఉద్యోగులను తొలగించే ప్రక్రియ ఉంది.
అలా తొలగించబడిన ఉద్యోగులకు తదుపరి ఎక్కడా ఉద్యోగం రాక,కుటుంబాలను పోషించుకోలేక సతమతమవుతున్నారు.
కొన్ని కుటుంబాలలో ఆత్మహత్యలకు కూడా పాల్పడుతున్నారు.
ఈ విధంగా జరగడం వారి హక్కును హరించడమే ఇక్కడ మానవ హక్కులు ఎక్కడా? ఇది చూసే ఐక్యరాజ్య సమితి హక్కుల అధ్యక్షుడు వొల్కర్ టక్కర్ మానవ హక్కులు ఉద్యోగుల నైపుణ్యాలను గౌరవించడం ప్రధానం అని పేర్కొన్నారు.ట్విట్టర్ ఉద్యోగులను తొలగించడం ద్వారా ఆయన స్పందిస్తూ ఉద్యోగులను తొలగించడంలో వారు అభద్రతా భావం తో ఉంటారని,వారి కుటుంబాలు వీధిన పడతాయని ఇది మంచి పద్ధతి కాదని ఆ సంస్థ నూతన యజమాని ఎలన్ మస్క్ కు తెలియజేశారు.
ఉద్యోగులను తొలగింపు ఒక ట్విట్టర్ లోనే కాకుండా నేడు అన్ని ఐ.టి ఉద్యోగుల తొలగింపులో కూడా ఉంది.ఒక సంస్థ లో ఉద్యోగి పని చేస్తున్నప్పుడు అతని హక్కులను గౌరవించడం కూడా ఆయా సంస్థల బాధ్యత.ఉద్యోగులను తొలగించాలి అనుకుంటే ముందుగా వారికి చెప్పి మీరు ఆరు నెలలలోగా మరో ఉద్యోగం చూసుకోండి అని అప్పటి వరకు వారికి వచ్చే వేతనం ఇవ్వాలి.
ప్రస్తుతం కొన్ని సంస్థలు అవేమి ఇవ్వడం లేదు.ఇది ఎక్కువగా ఎక్కడ ఉందంటే భారత్ లో కొన్ని రాష్టలలో ప్రైవేటు సంస్థలలో పని చేసే వారు ముఖ్యంగా బోధనా సంస్థలలో పని చేసే వారు తమ హక్కులను కోల్పోతున్నారు.
ఇక్కడ యాజమాన్యం వారి హక్కులు అణగద్రొక్కడం శోచనీయం.సదరు ఉద్యోగి నెలలో మధ్యలో కొన్ని కారణాల వల్ల డ్రాప్ అయితే అంతవరకు అతనికి రావాల్సిన బకాయులు చెల్లించాలి.
ఇవేమీ సంస్థలు చేయడం లేదు.అంతవరకు అతను చేసిన శ్రమ అంతా నిరుపయోగం.

ఏమైనా ప్రశ్నిస్తే వారు మధ్యలో వెళ్ళారు మాకు, మా సంస్థ కు నష్టం అని యాజమాన్యం చెప్పడం, దానికి కొందరు ఉద్యోగులు ఎదురు తిరగడం,కొందరు మౌనంగా ఉండటం జరుగుతోంది.ఇంకా కొన్ని సంస్థలలో ఉద్యోగి ఉండగానే అతని స్థానంలో మరొకరిని చేర్చుకోవడం చూస్తే ఇక మానవ హక్కులు ఎక్కడ సమర్ధవంతంగా పని చేస్తున్నాయి? అనే ప్రశ్న ఉదయిస్తోంది.ఉద్యోగి తనంతట తానే తొలగి పోతే అతను పని చేసిన దానికి తనం ఇవ్వాలి.తదనంతరం సంస్థ వారి స్థానంలో మరొకరిని నియమించుకోవచ్చు.ఇదంతా ఒక ఎత్తైతే కంపెనీ పని భారం తగ్గించుకోవాలని,లేక పొదుపు చర్యలు తీసుకోవాలని తలంచి నప్పుడు కొన్ని ప్రముఖ సంస్థలు ఉద్యోగులను తొలగించడం వారి హక్కులను కాల రాయటమే ఈ వివక్ష తొలగాలి.అందుకే సంస్థలలో తప్పుడు ప్రచారం ఉండకూడదని టర్క్ పేర్కొన్నారు.
ప్రతి వ్యక్తి హక్కు గౌరవించాలి.ఉద్యోగిని గౌరవ ప్రదంగా చూసుకోవాలి.
ఉద్యోగులే సంస్థలకు మూల స్తంభం వంటి వారు, ఊపిరి వారే.ఉద్యోగులే లేకపోతే సంస్థలు ఆగిపోతాయి,మనుగడ సాగించలేవు.
ట్విట్టర్ ఒక పెద్ద సంస్థ.ఆ సంస్థ లోనే ఉద్యోగులను తొలగించడం చూస్తుంటే ఇక చిన్నా, చితక సంస్థలు ఏపాటివి.
విపరీతమైన ఫాలోయర్స్ ట్విట్టర్ కు ఉన్నారు.కనుక ప్రతి సంస్థ లోని ఉద్యోగుల హక్కులు సంస్థలు పరిరక్షించాలి.
స్వేచ్ఛగా పని చేసుకునే హక్కు కల్పించాలి.ఎప్పుడే కాని ఉద్యోగులను పరీక్షలకు,వత్తిడులకు గురి చేయరాదు.

స్వేచ్ఛా వాతావరణంలో వారు ఉత్తమంగా రాణించి సంస్థలకు రావాల్సిన లాభాలు,పేరు తేగలరు.అటువంటి సంస్థలు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నాయి.మానవ హక్కులు మానవ పురోగతి,అభివృద్ధి, సంక్షేమం ముడి పడి ఉంటాయి.వ్యక్తి ఉన్నతంగా, వ్యక్తిత్వ వికాసంగా పురోగమించాలి అంటే మానవ హక్కులు అవసరం.అయితే నేడు ఈ హక్కులు లోపభూయిష్టంగా, ఇంకా చెప్పాలంటే బూటకంగా ఉన్నాయి.అలా ఉండకుండా జాతీయ మానవ హక్కుల కమిషన్ ఏర్పడింది.
మానవ హక్కుల పరిరక్షణ చేసారు విధి ఏదనగా సమన్యాయ పాలన, అందరికి ఒకే న్యాయం అని చెబుతోంది.ఈనాడు మానవ హక్కుల భావన విశ్వ వ్యాప్తంగా విస్తరించ బడి ఉన్నందువల్ల ఎక్కడైనా వాటి ఉల్లంఘన జరిగే ప్రమాదం ఉంది.
కనుక ఏ సంస్థ అయినా పని చేసే వారికి ఉత్తమ జీవితాన్ని ఇవ్వాలి.ఇలా చేయడం వల్ల పరిణితి గల, నైపుణ్యం గల ఉద్యోగులు ఎక్కడా మార్పు కావాలని కోరుకోరు.
జీతం తక్కువైనా అటువంటి సంస్థలలో పని చేయడానికే ఉద్యుక్తులవుతారు.తదనుగుణంగా వస్తున్న మార్పులు ప్రతి ఒక్కరూ గమనించాలి.