పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) కు కోట్ల సంఖ్యలో అభిమానులు ఉన్నారు.పవన్ గురించి ఎవరైనా తప్పుగా కామెంట్ చేస్తే అభిమానులు అస్సలు ఊరుకోరనే సంగతి తెలిసిందే.
పవన్ ఎంత మంచి వ్యక్తి అయినా కొంతమంది మాత్రం తరచూ ఆయనను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ లు వైరల్ అవుతున్నాయి.పవన్ కళ్యాణ్ ఉమనైజర్ అంటూ ఉమైర్ సంధు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
గతంలో పెద్ద సినిమాల గురించి వివాదాస్పద రివ్యూలు ఇవ్వడం, కామెంట్లు చేయడం ద్వారా పాపులర్ అయిన ఉమైర్ సంధు(Umair Sandhu) ఇప్పటికీ తన ప్రవర్తనను మార్చుకోలేదని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తుండటం గమనార్హం.ఉమైర్ సంధు తన పోస్ట్ లో పవన్ కళ్యాణ్ డై హార్డ్ ఉమనైజర్ అని ఆయన ఇప్పటికే రెండుసార్లు విడాకులు తీసుకున్నాడని పేర్కొన్నారు.
పవన్ వ్యక్తిగత జీవితం గురించి అసభ్యంగా హీరోయిన్లతో లింక్ చేస్తూ ఉమైర్ సంధు ట్వీట్ చేశారు.
ఈ కామెంట్ల గురించి ఫ్యాన్స్(fans) సైతం ఘాటుగా జవాబిస్తున్నారు.ఏ అర్హత ఉందని ఉమైర్ సంధు పవన్ పై విమర్శలు చేస్తున్నాడని ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు.పవన్ ఇప్పటికే విడాకులు తీసుకోవడానికి గల కారణాలు చెప్పాడని పవన్ ను విమర్శించడానికి ఇంతకు మించిన విమర్శలు దొరకవా? అంటూ ప్రశ్నిస్తున్నారు.ఈ మధ్య కాలంలో పెద్ద హీరోలను టార్గెట్ చేస్తూ విమర్శలు చేయడం ఫ్యాషన్ అయిపోయిందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
ఏ అర్హత లేని ఉమైర్ సంధు గతంలో కూడా పవన్ కళ్యాణ్ సినిమాలపై నెగిటివ్ కామెంట్లు చేశారని ఈ సందర్భంగా ఫ్యాన్స్ గుర్తు చేస్తున్నారు.ఉమైర్ సంధు కామెంట్లపై స్పందించడం కూడా వృథా అని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.సినిమా సినిమాకు పవన్ కళ్యాణ్ మార్కెట్ అంతకంతకూ పెరుగుతోంది.