వైరల్: స్కూటర్ కొట్టేద్దామని దొంగలు ప్లాన్.. చివరికి వారి స్కూటరే పోయింది..

సాధారణంగా దొంగతనం చేయాలంటే చాలా ప్లానింగ్ ఉండాలి.అలానే చుట్టుపక్కల పరిసరాలన్నీ చూసుకొని తెలివితో బయటపడగలగాలి.

 Two Thieves Went To Steal A Motorcycle And Ended Up Losing Theirs Details, Thiev-TeluguStop.com

కానీ దొంగతనంలో ఎలాంటి అనుభవం లేకుండా పట్టపగలే స్కూటర్( Scooter ) దొంగలించాలని ఇద్దరు అనుకున్నారు.అనుభవం లేకపోవడం వల్ల వారు తప్పించుకోలేకపోయారు.

చివరికి వారు తమ సొంత స్కూటర్‌నే పోగొట్టుకోవాల్సి వచ్చింది.దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో( Social Media ) వైరల్‌గా కూడా మారింది.

ఇది చూసి నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు.

ఈ హాస్యాస్పదమైన దొంగతనం టార్గెట్ చేసిన ఇంట్లోనే అమర్చిన సీసీటీవీ కెమెరాల్లో రికార్డైంది.అందులోని విజువల్స్ ప్రకారం ఆ ఇద్దరు దొంగలు( Two Thieves ) దొంగచాటుగా తిరుగుతున్నట్లు కనిపించింది.తర్వాత ఆ ఇంటి ముందు ఉన్న స్కూటీని తీసుకొని పరారవుదామని ఒక దొంగ ప్రయత్నించడం మొదలుపెట్టాడు.

కొద్దిసేపటి తర్వాత యజమాని ఈ దొంగలను చూశాడు.ఆపై అరుస్తూ అతను వేగంగా వారి వైపుకు పరిగెత్తాడు.

వరుస పంచ్‌లతో దొంగలపై విరుచుకుపడ్డాడు.ఇది ఊహించని సదరు దొంగలు షాక్ అయ్యారు.

కనీసం తాము తెచ్చుకున్న స్కూటీనైనా అక్కడినుంచి తీసుకెళ్దాం అనుకున్నారు కానీ అది కుదరలేదు.దాంతో పరాయి స్కూటీ కోసం వస్తే వారి స్కూటీనే పోయింది.

దొంగలను పట్టుకోవడానికి చుట్టుపక్కలవారు, ఇంటి యజమాని కుటుంబ సభ్యులు త్వరగా వచ్చేడంతో వారి ప్రయత్నాలు ఫలించలేదు.ఈ ఆకస్మిక పరిణామాలు వల్ల ఇద్దరూ తమ సొంత స్కూటర్‌ని వదిలిపెట్టి ప్రాణాల కోసం పరుగెత్తవలసి వచ్చింది.దీనికి సంబంధించిన వీడియోను ట్విట్టర్‌ హ్యాండిల్ @CCTVidiots షేర్ చేసింది.ఈ వీడియోపై నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేశారు.‘ఇద్దరు దొంగలు మోటార్‌సైకిల్‌ను దొంగిలించడానికి వెళ్లి, చివరికి వారిది పోగొట్టుకున్నారు’ అనే క్యాప్షన్‌తో ఈ వీడియోని షేర్ చేశారు.అప్పటి నుంచి వీడియో వైరల్‌గా మారింది.దీనికి 3.5 మిలియన్లకు పైగా వ్యూస్, 62,000 కంటే ఎక్కువ లైక్‌లు వచ్చాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube