ప్రస్తుతం కర్ణాటక రాష్ట్రంలో ఓ వివాహ వేడుక సంబంధించి పెద్ద దుమారాన్ని రేపుతోంది. కొడవ సంప్రదాయం ప్రకారం ఇద్దరు యువకులు పెళ్లి చేసుకోవడాన్ని ఆ సామాజిక వర్గాల వారు తప్పు పడుతున్నారు.
ఇది వారి సంప్రదాయానికి ఎంతో విరుద్ధమని స్వలింగ వివాహంతో తమ సామాజిక వర్గ ప్రజల మనోభావాలను దెబ్బతీస్తున్నరంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇక ఈ విషయంలో పెళ్లి చేసుకున్న ఇద్దరు వ్యక్తులను… ఆ సామాజిక వర్గం చెందిన పెద్దలు కచ్చితంగా వదిలిపెట్టమని స్పష్టంగా తెలుపుతున్నారు.
ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే… కాలిఫోర్నియాలో డాక్టర్ గా పనిచేస్తున్న శరత్ పొన్నప్ప, ఉత్తర భారత దేశంలో ఉన్న సందీప్ దోసంజ్ అనే యువకుడితో పరిచయం ఏర్పడి అది తర్వాత ప్రేమగా మారి, ఇద్దరూ కలిసి వివాహం చేసుకున్నారు.ఇక వీరిద్దరూ అమెరికాకు వెళ్లి అక్కడ స్థిరపడ్డారు.
గత నెలలో అక్కడే వీరిద్దరూ ఒకటయ్యారు.అమెరికాలోని కాలిఫోర్నియాలో ఓ రెస్టారెంట్లో వీరు కొడవ సంప్రదాయం ప్రకారంవివాహం చేసుకున్నారు.
కొడవ సంప్రదాయానికి సంబంధించిన దుస్తులను ధరించి వీరిద్దరూ వివాహం చేసుకున్నారు.అయితే ఈ కార్యక్రమానికి వారి కుటుంబీకులు కూడా రావడం నిజంగా ఆశ్చర్యపరిచే విషయమే.
ఇకపోతే కొడవ సంప్రదాయ ప్రకారం స్వలింగ వివాహం విరుద్ధమని, అంతేకాకుండా సంప్రదాయ దుస్తులలో వివాహం జరిపించడం ఏంటని వారిపై ఆ సామాజికం చెందిన వారు మండిపడుతున్నారు.అయితే ఈ విషయం సంబంధించి కొడవ సామాజిక వర్గం పెద్దలు విమర్శలు చేస్తున్న నేపథ్యంలో పెళ్లి చేసుకున్న ఇద్దరు వ్యక్తులతో మాట్లాడడానికి ప్రయత్నించగా అందులో శరత్ పొన్నప్ప అందుబాటులోకి రాలేదు.
అంతేకాదు, ఈ విషయంపై అతని తల్లిదండ్రులు కూడా మాట్లాడటానికి నిరాకరించారు.చూడాలి మరి ఈ విషయం ఎంతవరకు వెళ్తుందో.