Snehal Rai : ఇల్లు లేక ఖాళీ కడుపుతో కారులో నిద్రపోయాము.. నటి కామెంట్స్ వైరల్?

సాధారణంగా సెలబ్రిటీలు తెరపైన నవ్వుతూ అందరినీ అలరిస్తూ ఉంటారు.కానీ తెర వెనుక కూడా అదేవిధంగా ఉంటారు అని అనుకోవడం పొరపాటే అని చెప్పవచ్చు.

 Tv Actress Snehal Rai Reveals Sad Incidents In Her Past Life-TeluguStop.com

చాలామంది సెలబ్రిటీల విషయంలో వారికి ఏంటి కావాల్సినంత డబ్బు ఉంది ఎంజాయ్ చేస్తుంటారు అని చెబుతూ ఉంటారు.కానీ అందరూ ఇలాగే ఉంటారు అనుకుంటే పొరపాటు పడ్డట్టే.

ఎందుకంటే పైకి నవ్వుతూ కనిపించే ప్రతి ఒక్క సెలబ్రిటీల వెనుక ఎన్నో కష్టాలు ఎన్నో ఏడుపులు దాగి ఉన్నాయి.కానీ సెలబ్రిటీలకు తెర వెనుక ఎన్ని కష్టాలు ఉన్న తెరపైకి రాగానే అవన్నీ ఒక్కసారిగా మరిచిపోయి ముఖంపై నవ్వులు చిందిస్తూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు.

అంతేకాకుండా సెలబ్రిటీలు కూడా ఎన్నో రకాల కష్టాలను కూడా అనుభవించిన వారే.అటువంటి వారిలో స్నేహల్ రాయ్ కూడా ఒకరు.

Telugu Snehal Rai, Snehal Rai Sad, Snehalrai, Tvactress-Movie

స్నేహల్ రాయ్ ( Snehal Roy )ఒక టీవీ సీరియల్ నటి అన్న విషయం తెలిసిందే.కాగా స్నేహల్ రాయ్ ప్రస్తుతం మోడల్ గా, యాంకర్ గా కూడా రాణిస్తున్న విషయం తెలిసిందే.ఇది ఇలా ఉంటే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న స్నేహల్ రాయ్ జీవితంలో ఏదైనా చేదు అనుభవాల గురించి చెప్పుకొచ్చింది.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.నాన్న అమ్మను విపరీతంగా కొట్టేవాడు,9 ఏళ్ల వయసులోనే గృహ హింస( domestic violence )ను చూశాను అని తెలిపింది.నాన్న కొడుతుంటే అమ్మ అది ఆట అనేదని, దెబ్బలు కనిపించకుండా అమ్మ కవర్ చేసేదని ఆమె వెల్లడించింది.

నాన్న అమ్మను కొడుతున్న విషయం తమకు అర్థమయ్యేది కాదని, అయితే ఆ నరకం నుంచి బయట పడేందుకు ఆమె అమ్మ ఒక రోజు కఠిన నిర్ణయం తీసుకుందని స్నేహాల్ వెల్లడించింది.

Telugu Snehal Rai, Snehal Rai Sad, Snehalrai, Tvactress-Movie

తనను, తన చెల్లెలిని తీసుకుని ఆమె తల్లి ఇంట్లోంచి బయటకు వచ్చేసిందని, అప్పుడొక కొత్త జీవితాన్ని ప్రారంభించిందని ఆమె తెలిపింది.ఆ సమయంలో ఎన్నో కష్టాలను పడ్డాము.ఉండడానికి ఇల్లు లేకపోతే ఒక బస్తీలో ఉన్నాము.

తినడానికి తిండి ఉండేది కాదు.కేవలం పానీపూరీ తిని ఆ నీళ్లు ఎక్కువగా తాగి కడుపు నింపుకునేవాళ్లం అని చెప్పుకొచ్చింది.

ఖాళీ కడుపుతోనే నిద్రపోయేవాళ్లమని ఆమె తెలిపింది.తాను 16 ఏళ్ల వయసులోనే పని చేయడం మొదలుపెట్టినట్లు ఆమె తెలిపింది.

ఉదయం సెలూన్ లో రిసెప్షనిస్టుగా, సాయంత్రం కాల్ సెంటర్ లో పని చేసేదాన్నని ఆమె తెలిపింది.ఈ క్రమంలో స్కూల్ కి తరచూ వెళ్లలేకపోయేదాన్నని, తన పరిస్థితి అర్థం చేసుకుని టీచర్లు అటెండెన్స్ వేసేవారని ఆమె వెల్లడించింది.

తన తండ్రి రెండో పెళ్లి చేసుకున్నాడని, ఆ తర్వాత తన తప్పు తెలుసుకుని అమ్మను చేరదీశాడని ఆమె పేర్కొంది.తన తండ్రి క్షమాపణలు అడక్కపోయినా తాము క్షమించమని మారడానికి ఒక అవకాశం ఇవ్వాలి కదా అని వెల్లడించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube